close
Choose your channels

నెటిజన్‌ కౌంటర్‌కి మాధవన్ రిప్లై

Saturday, August 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నెటిజన్‌ కౌంటర్‌కి మాధవన్ రిప్లై

తమిళ నటుడైన మాధవన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈయన నటించిన తమిళ చిత్రాలు సఖి, చెలి, యువ చిత్రాలు తెలుగులోనూ మంచి విజయాలను సాధించాయి. తెలుగులో ఈయన సవ్యసాచిలో నెగెటివ్ పాత్రలో నటించారు. తాజాగా అనుష్కతో కలిసి `నిశ్శబ్ధం`లో నటిస్తున్నారు. ఈ ఏడాది చివరల్లో ఈ చిత్రం విడుదల కానుంది. రీసెంట్‌గా రాఖీపౌర్ణమిని పురస్కరించుకుని తన కొడుకు, తండ్రితో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు మాధవన్. దీనిపై పలువురు తమ స్పందనను తెలియజేశారు.

అయితే ఓ నెటిజన్ స్పందిస్తూ... ``జీసస్ శిలువలు, ఫొటోలు పూజా మందిరాల్లో ఉంటాయా? ఇదంతా సెట్ అప్.. దీని కారణంగా మీపై ఉన్న గౌరవం పోయింది`` అంటూ స్పందించాడు. దానికి మాధవన్ రిప్లై ఇస్తూ..``సంకుచిత భావాలున్న నీలాంటి వ్యక్తుల రెస్పెక్ట్ నాకు అవసరం లేదు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను. గుళ్లకే కాదు చర్చికి, మసీదుకి కూడా వెళతాను`` అన్నారు. మాధవన్ రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.