close
Choose your channels

మహేష్ కారవాన్ ధర తెలిస్తే...

Friday, March 19, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహేష్ కారవాన్ ధర తెలిస్తే...

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అయింది. అది ఆయన కారవాన్ గురించి. ఈ న్యూస్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఇటు ఇండస్ట్రీలోనూ.. అటు ఫాన్స్ సర్కిల్స్ లోనూ ఇంట్రస్టింగ్ టాపిగ్గా నిలిచింది. నిజానికి ఈ కారవాన్ ప్రత్యేకతలు గురించి అయితే బయటకు వచ్చింది కానీ దాని ధర ఇతరత్రా విశేషాలు మాత్రం బయటకు రాలేదు. ఇప్పటికే సూపర్ స్టార్ వాడుతున్న కారవాన్‌లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కొత్తగా తీసుకొస్తున్న కారవాన్ మరింత అత్యాధునికమైనది. ముంబై బేస్డ్ కంపెనీ ఒకటి దీన్ని డిజైన్ చేసింది.

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ తన కారవాన్‌ కోసం ఆరున్నర కోట్లు ఖర్చు చేస్తే.. మహేష్ తన కారవాన్ కోసం రూ.8 కోట్లు ఖర్చు చేశాడట. నిజం.. మహేష్ కారవాన్ ధర అక్షరాలా రూ.8 కోట్లని సమాచారం. దీనిని మహేష్ దగ్గరుండి మరీ డిజైన్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. కారవాన్‌లో రెండు బెడ్రూములు, ఎక్కడికక్కడ ఏసీలు.. హోం థియెటర్లు ఉన్నాయి. అయితే వీటన్నింటినీ ఐపాడ్‌తోనే కంట్రోల్ చేసే హైఫై సిస్టమ్ దీని ప్రత్యేకత. ఇక ప్రస్తుతం మహేష్ నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్లేస్‌లో తన కారవాన్ కోసం ప్రత్యేకంగా ఒక షెడ్డును సైతం మహేష్ ఏర్పాటు చేసుకున్నట్టు టాక్.

తాజాగా ఈ కారవాన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానిలోని సౌకర్యాలు, లగ్జరీని చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. మహేశ్‌ ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పరుశురామ్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.