close
Choose your channels

మేరీకోమ్‌కు మ‌హేష్ అభినంద‌న‌లు

Monday, November 26, 2018 • తెలుగు Comments

మేరీకోమ్‌కు మ‌హేష్ అభినంద‌న‌లు

సోష‌ల్ మీడియాలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఈ మ‌ధ్య చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. త‌న ఫ్యామిలీ విశేషాల‌ను తెలియ‌జేయ‌డ‌మే కాదు.. మంచి విష‌యాల ప‌ట్ల త‌న అభిప్రాయాన్ని తెలియ‌జేస్తూ వ‌స్తున్నారు. తాజాగా లేడీ బాక్స‌ర్ మేరీ కోమ్ సాధించిన విజ‌యం ప‌ట్ల మ‌హేష్ ఆమెను శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ షిప్ పోటీల్లో 48 కేజీల విభాగంలో మేరీ కోమ్‌.. ఒకోటాపై విజ‌యం సాధించి ఆరో స్వ‌ర్ణం సాధించి చ‌రిత్రను సాధించారు. బాక్సింగ్‌లో మేరీ కోమ్ సాధించిన విజ‌యం సాధించ‌డం ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌ని మ‌హేష్ తెలిపారు. 

Get Breaking News Alerts From IndiaGlitz