మహేష్ బాబు కొత్త సినిమా ప్రారంభమయ్యేది ఆ రోజునే...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ ఇండియా లేడు. `మహర్షి` సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ సమ్మర్వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈయన తదుపరి చేయబోయే 26వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
సాధారణంగానే తన సినిమా ఓపెనింగ్లకు మహేష్ రాడు. ఇక ఇండియాలో లేనప్పుడు ఆ ఆలోచన రావడమే తప్పు అవుతుంది. ఎప్పటిలా మహేష్ తన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణనే ముఖ్య అతిథిగా పంపబోతున్నారు.
ఆసక్తికరమైన విషయమేమంటే మహేష్ 26వ సినిమాకు ముహూర్తం కుదిరిందని వార్తలు వినపడుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుందట. జూలై నుండే రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.