close
Choose your channels

'మా' ఈవెంట్‌ను మ‌హేశ్ త‌ప్పుకున్నాడా..!

Thursday, September 6, 2018 • తెలుగు Comments

`మా` ఈవెంట్‌ను మ‌హేశ్ త‌ప్పుకున్నాడా..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా అమెరికాలో నిర్వ‌హిస్తున్న సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయ‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అధ్యక్షుడు శివాజీ రాజా, శ్రీకాంత్ ఓ వ‌ర్గంగా ఏర్ప‌డితే.. జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేశ్ మ‌రికొంత మంది మ‌రో వ‌ర్గంగా ఏర్ప‌డి మీడియాలో ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. చిరంజీవి ఈవెంట్ త‌ర్వాత మ‌హేశ్ ఈవెంట్‌కు హాజ‌రు కావాల్సింది ఉంది.

అయితే మా ఇప్పుడు నిధులు దుర్వినియోగం అనే ఆరోప‌ణ‌ల‌తో బ‌జారున ప‌డింది. దీంతో మ‌హేశ్ ఈవెంట్ నుండి డ్రాప్ కావాల‌నుకుంటున్నాడ‌ట‌. బెన‌ర్జీ.. మ‌హేశ్‌ను ఈవెంట్‌కు తీసుకెళ్లాల‌ని న‌మ్ర‌త‌ను సంప్ర‌దించాడ‌ట‌. అయితే ఆమె మ‌హేశ్ ఆస‌క్తిగా లేడ‌ని చెప్పిన‌ట్లు సమాచారం. మా స్థానంలో చిన్న‌పిల్ల‌ల‌కు స‌పోర్ట్‌గా నిలుస్తున్న ఓ సంస్థ కోసం ఈవెంట్ చేయాల‌నుకుంటున్నాడ‌ట మహేశ్‌.