close
Choose your channels

హీరో క్యారెక్టరైజేషన్ చెప్పేస్తోన్న ‘‘సర్కార్ వారి పాట’’ టైటిల్ సాంగ్.. మీరూ ఓ లుక్కేయండి

Saturday, April 23, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట' సినిమాపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవరు వంటి వరుస బ్లాక్ బస్టర్లతో ప్రిన్స్ దూకుడు మీదున్నారు. అలాగే గీతా గోవిందం వంటి భారీ హిట్‌ తర్వాత పరశురామ్.. మహేశ్‌తో జత కలవడంతో సర్కారు వారి పాటకు ఎక్కడా లేని హైప్ వచ్చింది. తొలుత ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావించారు. అయితే 'ఆర్ఆర్ఆర్' , రాధేశ్యామ్ వంటి భారీ సినిమాలు లైన్‌లో వుండటంతో సర్కార్ వారి పాటను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం అన్ని పరిస్థితులు కుదుటపడటంతో సమ్మర్ కనుకగా మే 12న గ్రాండ్‌గా విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మేకర్స్. దీనిలో భాగంగా కొద్దిరోజుల క్రితం ఈ సినిమాలోని కళావతి, పెన్నీ సాంగ్స్‌ని విడుదల చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సర్కార్ వారి పాట టైటిల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ‘‘సర సర సర సర్కారు వారి పాట.. తిరుగులేని బాట’’ అంటూ సాగే ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం, థమన్ స్వరాలు అందించగా.. హారికా నారాయణ్ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న సర్కార్ వారి పాటను... మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో సూపర్‌స్టార్ సరసన తొలిసారిగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.