close
Choose your channels

మ‌హేష్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

Wednesday, August 17, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో భారీ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ లో ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో మ‌హేష్ పై కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.ఈ నెల 22 నుంచి తాజా షెడ్యూల్ ప్రారంభించ‌నున్నారు.

మురుగుదాస్ ర‌మ‌ణ‌, గ‌జిని, స్టాలిన్, తుపాకి...చిత్రాల్లో చూపించిన‌ట్టే సామాజిక అంశాన్ని ఈ చిత్రంలో కూడా చూపించ‌నున్న‌ట్టు స‌మాచారం.విభిన్న క‌థాంశంతో రూపొందే ఈ చిత్రంలో మ‌హేష్ చేసే పోరాటం, ఆయ‌న క్యారెక్ట‌ర్ ఈ చిత్రానికి ప్ర‌త్యేకార్ష‌ణ‌గా నిలుస్తాయట‌. తెలుగు, త‌మిళ్ లో భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.