close
Choose your channels

మలయాళం డీజే ఎప్పుడంటే...

Tuesday, July 4, 2017 • తెలుగు Comments

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్‌కు మ‌ల‌యాళంలో మంచి క్రేజ్ ఉంది. మాలీవుడ్‌లో బ‌న్ని అంద‌రూ మ‌ల్లు అర్జున్ అని పిలుస్తుంటారు. తెలుగులో విడుద‌లైన అల్లు అర్జున్ ప్ర‌తి సినిమా మ‌ల‌యాళంలో విడుద‌ల‌వుతుంటుంది. రీసెంట్‌గా తెలుగులో విడుద‌లైన డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ వంద‌కోట్ల మైలురాయిని అందుకుంది. ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ సినిమాను కూడా మ‌ల‌యాళంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
 
మల‌యాళ వెర్ష‌న్‌లో సినిమాను జూలై 14న విడుద‌ల చేయాల‌నేది వారి ఆలోచ‌న‌ట‌. ప్ర‌స్తుతం బ‌న్ని యు.ఎస్‌లో డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌ను ప్ర‌మోట్ చేస్తున్నాడు. అల్లుఅర్జ‌న్‌, దిల్‌రాజు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన హ్యాట్రిక్ హిట్ మూవీ `డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`. దిల్‌రాజు బ్యాన‌ర్‌లో రూపొందిన 25వ చిత్రం కూడా ఇదే కావ‌డం విశేషం. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా త‌ర్వాత బ‌న్ని వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమాలో న‌టిస్తాడు.