close
Choose your channels

Mallikarjun Kharge:ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే..!

Wednesday, December 20, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా కూటమి(I.N.D.I.A Alliance) వేగంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తోంది. హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ(NDA) భావిస్తుంటే.. ఈసారి అధికారంలోకి రావాలని ఇండియా కూటమి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 3గంటలకు పైగా జరిగిన సమావేశంలో ప్రధాని అభ్యర్థిత్వంతో పాటు పార్లమెంటులో విపక్ష ఎంపీలపై వేటు, రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఉభయసభల్లో ఎంపీల సస్పెన్షన్‌పై డిసెంబర్‌ 22న దేశ వ్యాప్త నిరసనకు దిగాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), అగ్ర నేతలు సోనియా గాంధీ (Sonia gandhi), రాహుల్‌ గాంధీ (Rahul gandhi), మమతా బెనర్జీ (Mamatha Benarjee), స్టాలిన్‌ ( Stalin), శరద్‌ పవార్‌(Sarad pawar), సీతారాం ఏచూరి, డి.రాజా, నీతీశ్ కుమార్‌(Nitish kumar), కేజ్రీవాల్‌(Kejriwal), లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge)ను ఇండియా కూటమి ప్రధాన మంత్రి(Prime Minister)అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలు పార్టీలకు చెందిన సీనియర్‌ నేతలు తీసుకొచ్చారు. అయితే ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పుడే ప్రకటన చేయొద్దని ఖర్గే వారించినట్లు తెలుస్తోంది. సమష్టిగా పోరాటం చేసి, విజయం సాధించిన తర్వాత ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దామని స్పష్టం చేశారట. అలాగే జనవరి మొదటి వారంలో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇక రాహుల్ గాంధీ చేపట్టిన రెండోదశ భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) జనవరి మొదటివారంలో ప్రారంభించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. భారత్ జోడో యాత్ర 2.0 హైబ్రిడ్ మోడ్‌లో ఉంటుందని తెలిపాయి. ఇందులో పాల్గొనేవారు కాలినడకతో పాటు వాహనాలను కూడా ఉపయోగించనున్నారట. ఈశాన్య రాష్ట్రం నుంచి ప్రారంభమై ఉత్తరప్రదేశ్, బీహార్ ,మహారాష్ట్రల మీదుగా సాగుతుందని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు సాగనున్న ఈ భారత్ జోడో యాత్రలో రాహుల్ పలు రాష్ట్రాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని తెలిపారు. కాగా 2022 సెప్టెంబరు 7వతేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర మొదటి దశ జనవరి 2023లో జమ్మూ, కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగిసిన సంగతి తెలిసిందే. 12 రాష్ట్రాల్లో 75 జిల్లాల మీదుగా 4,080 కిలోమీటర్లు ఈ యాత్ర సాగింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.