close
Choose your channels

Manoj, Mounika:పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మంచు మనోజ్ దంపతులు

Saturday, April 13, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మంచు వారి ఇంట్లోకి మరో వారసురాలు వచ్చింది. హీరో మనోజ్ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మనోజ్ సోదరి మంచు లక్ష్మీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. "మనోజ్– మౌనిక మరోసారి తల్లితండ్రులయ్యారు. మా ఇంట్లోకి దేవత వచ్చింది. మనోజ్ దంపతులు పాపకి జన్మనిచ్చారు. అన్నగా ధైరవ్ సంతోషిస్తున్నాడు. అప్పుడే తనకి MM పులి అనే నిక్ నేమ్ కూడా పెట్టాము. శివుడి ఆశీస్సులు ఈ ఫ్యామిలీపై ఉండాలని కోరుకుంటున్నాను" పోస్ట్ చేశారు.

ప్రస్తుతం మంచు లక్ష్మి పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో మనోజ్– మౌనిక దంపతులకు అభిమానులు, నెటిజన్, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మంచు లక్ష్మి చేసిన ట్వీట్‌ని మనోజ్ కూడా రీ ట్వీట్ చేశాడు. మొత్తానికి తొలిసారి తండ్రి అయిన ఆనందంలో మనోజ్ ఉన్నాడు. కాగా మంచు మనోజ్ 2023లో దివంగత మంత్రులు భూమా నాగిరెడ్డి-శోభారెడ్డి రెండో కుమార్తె మౌనికను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటికే మౌనికకు ధైరవ్ అనే బాబు ఉన్నాడు. మనోజ్‌ కూడా తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు.

అనంతరం చిన్నప్పటి నుంచి పరిచయంతో మనోజ్-మౌనిక పెళ్లిచేసుకునేందుకు సిద్ధమయ్యారు. దీనికి ఇరు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో ఓ ఇంటి వారయ్యారు. ఇటీవల ఇద్దరూ కలిసి ఓ కొత్త బిజినెస్ కూడా మొదలుపెట్టారు. గతేడాది డిసెంబర్‌లో మౌనిక కడుపుతో ఉన్న సంగతిని మనోజ్ తెలిపాడు. కాగా ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో యువ హీరోలు వరుసగా తండ్రులు అవుతున్నారు. కొన్ని రోజుల క్రితమే నిఖిల్, శర్వానంద్ తండ్రులు అయ్యారు.

కాగా మోహన్ బాబు రెండో వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మనోజ్ తన నటనతో అభిమానులను అలరించాడు. బిందాస్, వేదం, ఝుమ్మంది నాదం, రాజు భాయ్, కరెంట్ తీగ, పోటుగాడు, మిస్టర్ నూకయ్య, నేను మీకు తెలుసా? ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్.. మళ్లీ రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. త్వరలోనే వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం 'ఉస్తాద్' ర్యాంప్ ఆడిద్దాం అంటూ ఓ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.