close
Choose your channels

ర‌వితేజ‌తో మ‌ణిర‌త్నం హీరోయిన్?

Sunday, July 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ర‌వితేజ‌తో మ‌ణిర‌త్నం హీరోయిన్ ?

`చెలియా`(త‌మిళంలో `కాట్రు వెలియ‌డు`) సినిమాతో పాటు తెలుగులో `స‌మ్మోహ‌నం` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు హీరోయిన్ అదితిరావు హైద‌రి సుప‌రిచిత‌మే. హిందీలోనూ `ఢిల్లీ 6`, `రాక్‌స్టార్` స‌హా పలు చిత్రాల్లో న‌టించింది అక్క‌డి ప్రేక్ష‌కుల‌నూ ఆక‌ట్టుకుంది. ఇప్పుడు తెలుగులో నాని హీరోగా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కిస్తోన్న `వి` సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

కాగా.. ఇప్పుడు మ‌రో తెలుగు సినిమాలో ఈమె న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. ర‌వితేజ హీరోగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో `మ‌హాస‌ముద్రం`(విన‌ప‌డుతున్న టైటిల్‌) పేరుతో ఓసినిమా రూపొంద‌నుంది. ఇందులో హీరోయిన్‌గా అదితిరావు హైద‌రిని న‌టింప చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని టాక్‌. సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమా స్టార్ట్ అవుతుంద‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.