close
Choose your channels

'మ‌న్మ‌థుడు 2' కి ఫ్యాన్సీ డిజిట‌ల్‌

Tuesday, July 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌న్మ‌థుడు 2 కి ఫ్యాన్సీ డిజిట‌ల్‌

కింగ్ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ హీరో, హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రాహుల్ రవీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఆగ‌స్ట్ 9న సినిమా విడుద‌ల కానుంది. కాగా.. ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల‌తో సినిమా డిజిట‌ల్‌కు ఫ్యాన్సీ ప్రైజ్ ద‌క్కింద‌ని స‌మాచారం. విన‌ప‌డుతున్న స‌మాచారం ప్ర‌కారం నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాదాపు ఏడుకోట్ల రూపాయ‌ల‌కు పైగానే చెల్లించి డిజిట‌ల్ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంద‌ట‌.

ఈ చిత్రంలో కీర్తిసురేశ్ కీల‌క పాత్ర‌లోన‌టించింది. 17 ఏళ్ల క్రితం విడుద‌లైన `మ‌న్మ‌థుడు` సినిమా స్ఫూర్తితో `మ‌న్మ‌థుడు2` తెర‌కెక్కుతోంది. `మ‌న్మ‌థుడు`లో అమ్మాయిలంటే చిరాకు ప‌డే పాత్ర‌లో నాగార్జున క‌న‌ప‌డిన సంగ‌తి విదిత‌మే. కానీ అందుకు పూర్తి భిన్న‌మైన ప్లేబోయ్ పాత్ర‌ను `మ‌న్మ‌థుడు 2`లో పోషిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.