close
Choose your channels

అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఔట్.. రోజా హ్యాపీ హ్యాపీ!!

Tuesday, July 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఔట్.. రోజా హ్యాపీ హ్యాపీ!!

నాడు ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే రోజాను అధికారపక్షం ఏడాదిపాటు సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. కాల్‌మనీ, సెక్స్ రాకెట్‌ గురించి టీడీపీ ప్రభుత్వ హయంలో మహిళలపై జరిగిన అకృత్యాలను ప్రశ్నించినందుకే తనపై ఏడాది పాటు అసెంబ్లీ నుండి సస్పెన్షన్ వేటు వేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత దాదాపు ఏపీ అసెంబ్లీలో సస్పెన్షన్స్ జరగలేదనే చెప్పుకోవాలి. అసెంబ్లీ బయట నిరసన తెలిపి.. అనంతరం హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి.. తిరిగి సభలోకి అడుగుపెట్టారు. సస్పెన్షన్‌ ఎత్తివేసే విషయంలోనూ అప్పటి స్పీకర్ కనీసం కనికరం చూపించలేదని.. అన్యాయంగా తనను సభ నుంచి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలేం జరిగింది ఇవాళ..!

అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ టైం ఒకేసారి ముగ్గురి ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలను సభ నుంచి సస్పెన్షన్ చేయడం జరిగింది. వాస్తవానికి మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీలో చరిత్రాత్మక బిల్లులు సభలో ప్రవేశపెట్టడం జరిగింది. నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ వర్క్స్‌లలోఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మహిళలకు కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అనంతరం 45 సంవత్సరాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్‌ పథకంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇవాళ సభ మొదలవ్వగానే... ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ఈ పెన్షన్ పథకంపై అధికార పార్టీ సభ్యులను ప్రశ్నించారు. ఇందుకు మంత్రి పెద్దిరెడ్డితో పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చేశారు.

మార్షల్స్ చేత బలవంతంగా...!!

అయితే ఈ క్రమంలో టీడీపీ సభ్యులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైనల్‌గా వారు ఈ చర్చ జరుగుతున్న క్రమంలో నిరసనలు, ఆందోళనలు చేపట్టడంతో ముగ్గురు సభ్యులను సభ నుంచి సస్పెన్షన్ చేయడం జరిగింది. సస్పెన్షన్ అనంతరం వారు అక్కడ్నుంచి వెళ్లకపోవడంతో మార్షల్స్‌ బలవంతంగా బయటికి ఎత్తుకెళ్లారు. అయితే ఈ వ్యవహారాన్ని టీడీపీ సభ్యులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సస్పెన్షన్ తర్వాత అసెంబ్లీ పాయింట్‌లో మీడియాతో మాట్లాడిన ఈ ముగ్గురు సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రోజా రియాక్షన్ ఇదీ..!

టీడీపీ ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేస్తూ డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకునే సమయంలో ఎమ్మెల్యే రోజా టీడీపీ ఎమ్మెల్యేలవైపు చూస్తూ నవ్వుకున్నారు. అంతేకాదు.. రివెంజ్ అంటే ఇదీ అంటూ అన్నట్లుగా రోజా నవ్వుతూ తన హావభావాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. టీడీపీ ఎమ్మెల్యేల వైపు తన చేతిని చూపిస్తూ చలోక్తులు విసిరారు. తన చేతిని కెమెరాలా పెట్టి చూడండి, చూడండి అంటూ.. తోటి ఎమ్మెల్యేలవైపు తిరిగి చూపించడం గమనార్హం. అయితే ఈ వ్యవహారం మొత్తం కెమెరా కంటపడటంతో రోజా ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో హైలైట్‌గా నిలిచారు.

అందర్నీ చేసేయండి!

అయితే ఈ సస్పెన్షన్ ఎత్తేయాలని ఇప్పటికే టీడీపీ సభ్యులు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని కలవడం జరిగింది. వారి విజ్ఞప్తి మేరకు ఇప్పటికే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డిని కలిసి వివరించారు. మరోవైపు ఇవాళ్టికి మాత్రమే వారిని సస్పెన్షన్ చేయాలని.. లేదంటే ఈ సెషన్ మొత్తం టీడీపీ సభ్యులందర్నీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఫైనల్‌గా డిప్యూటీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడా్లసిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.