close
Choose your channels

AP IPS Officers:ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు

Tuesday, January 30, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యలో భారీగా ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. సొంత జిల్లాలో అధికారులు ఉండకూడదని.. అలాగే మూడేళ్లుగా ఒకే జిల్లాలో కొనసాగకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అధికారుల బదిలీలు, పోస్టింగుల ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లను ట్రాన్స్‌ఫర్ చేశారు. తాజాగా 30 మంది అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ సెల్‌ విభాగంలో ఐజీగా ఉన్న కొల్లి రఘురామిరెడ్డిని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీగా బదిలీ చేశారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు డీజీగా ఉన్న కుమార్‌ విశ్వజిత్‌ను రైల్వేస్‌ అదనపు డీజీగా నియమించారు. విజయవాడ డీసీపీగా ఉన్న విశాల్‌ గున్నీని విశాఖ పట్నం రేంజి డీఐజీగా.. చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉన్న రిషాంత్‌రెడ్డిని ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా నియమించారు. కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న పల్లె జాషువాను చిత్తూలు జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. అనంతపురం ఎస్పీగా పని చేసిన ఫక్కీరప్పను విశాఖపట్నం జాయింట్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు.

అధికారుల బదిలీల జాబితా ఇదే..

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీగా కొల్లి రఘురామిరెడ్డి (డ్రగ్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గానూ అదనపు బాధ్యతలు)

రైల్వే పోలీస్‌ అదనపు డీజీగా కుమార్‌ విశ్వజిత్‌

ఏపీఎస్పీ అదనపు డీజీగా అతుల్‌ సింగ్‌

ఆక్టోపస్‌ ఐజీగా సీహెచ్‌ శ్రీకాంత్‌ (రోడ్డు సేఫ్టీ అథారిటీ ఐజీగానూ అదనపు బాధ్యతలు)

పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా రాజశేఖర్‌ బాబు (ఐజీ హోంగార్డ్స్‌గానూ అదనపు బాధ్యతలు)

సీఐడీ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి

పోలీసు సిబ్బంది వ్యవహారాల ఐజీగా హరికృష్ణ (టెక్నికల్‌ సర్వీసెస్ ఐజీగానూ అదనపు బాధ్యతలు)

ఆక్టోపస్‌ డీఐజీగా సెంథిల్‌ కుమార్‌ (శాంతిభద్రతల డీఐజీగాను అదనపు బాధ్యతలు)

పోలీసు శిక్షణ డీఐజీగా రాహుల్‌దేవ్‌ శర్మ

విశాఖ రేంజ్‌ డీఐజీగా విశాల్‌ గున్ని

కర్నూల్‌ రేంజ్‌ డీఐజీగా సీహెచ్‌ విజయరావు

విశాఖ సంయుక్త పోలీస్‌ కమిషనర్‌గా ఫకీరప్ప

కృష్ణా జిల్లా ఎస్పీగా అద్నాన్‌ నయీం ఆస్మి

ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా అమిత్‌ బర్దార్‌

ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఎస్పీగా ఆరిఫ్‌ హఫీజ్‌

ప.గో జిల్లా ఎస్పీగా హజిత్‌ వేజెండ్ల

రాజమండ్రి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌గా సుబ్బారెడ్డి

కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా రిశాంత్‌ రెడ్డి (ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగానూ అదనపు బాధ్యతలు)

చిత్తూరు ఎస్పీగా జాషువా

ఏసీబీ ఎస్పీగా రవిప్రకాశ్‌

విశాఖ శాంతిభద్రతల డీసీపీగా సీహెచ్‌ మణికంఠ

ఏపీఎస్పీ ఐదో బెటాలియన్‌ కమాండెంట్‌గా అధిరాజ్‌ సింగ్‌ రాణా

కాకినాడ మూడో బెటాలియన్‌ కమాండెంట్‌గా కృష్ణకాంత్‌ పటేల్‌

గుంటూరు ఎస్పీగా తుషార్‌

జగ్గయ్యపేట డీసీపీగా కె.శ్రీనివాసరావు

రంపచోడవరం ఏఎస్పీగా కె.ధీరజ్‌

పాడేరు ఏఎస్పీగా ఎ.జగదీశ్‌

విశాఖ డీసీపీగా సత్యనారాయణ

విజయవాడ డీసీపీగా ఆనంద్‌ రెడ్డి

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.