close
Choose your channels

'మ‌త్తు వ‌ద‌ల‌రా' రిలీజ్ కూడా అప్పుడేన‌ట‌!

Tuesday, December 3, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌త్తు వ‌ద‌ల‌రా రిలీజ్ కూడా అప్పుడేన‌ట‌!

పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ఓ చిన్న చిత్రం `మ‌త్తు వ‌ద‌ల‌రా`. ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అన్న‌య్య‌, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు శ్రీసింహా హీరోగా న‌టిస్తోన్న చిత్ర‌మిది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో పాటు క్లాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్ నిర్మాణంలో రితేష్ రానా ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. య‌న్టీఆర్ `య‌మ‌దొంగ‌`లో బాల ఎన్టీఆర్‌గా, మ‌ర్యాద రామ‌న్న‌, బాహుబ‌లి ది బిగినింగ్ చిత్రాల్లో న‌టించిన సింహా ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రాన్ని కిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేయ‌బోతున్నారట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌టన వెలువ‌డ‌నుంది.

ఇప్ప‌టికే కిస్మ‌స్ బ‌రిలో ఇప్ప‌టికే డిసెంబ‌ర్ 20 బాల‌కృష్ణ రూల‌ర్‌, సాయితేజ్ ప్ర‌తిరోజూ పండ‌గే, కార్తి దొంగ చిత్రాల‌తో పాటు స‌ల్మాన్‌ఖాన్ ద‌బాంగ్ 3 విడుద‌ల కానుంది. అలాగే మ‌రో ఐదు రోజుల గ్యాప్‌తో డిసెంబ‌ర్ 25న రాజ్ త‌రుణ్ ఇద్ద‌రి లోకం ఒక‌టే సినిమా విడుద‌ల కానుంది. కాగా ఈ రేసులో ఇప్పుడు `మ‌త్తు వ‌ద‌ల‌రా` సినిమా విడుద‌ల కానుంది. కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా రూపొదిన ఈ చిత్రం క్రిస్మ‌స్ పోరులో స‌క్సెస్ అవుతుందో లేదో చూడాలి. సినిమా చిన్న బడ్జెట్‌తో రూపొందిన‌ప్ప‌టికీ రాజ‌మౌళి, కీర‌వాణి వంటి వారి స‌పోర్ట్ ఉండ‌టంతో సినిమాకు ప్ర‌మోష‌న్స్ ప‌రంగా ఢోకా ఉండ‌క‌పోవ‌చ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.