close
Choose your channels

రానాతో మెగా హీరో...

Tuesday, January 2, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విల‌క్ష‌ణ‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్న యువ న‌టుల్లో రానా ద‌గ్గుబాటి ఒక‌రు. డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్స్‌ను ఎంచుకుని వాటిక‌నుగుణంగా ఆయా పాత్ర‌ల్లో ఒదిగిపోతుంటారు. గ‌త ఏడాది `బాహుబ‌లి`లో ప్ర‌తినాయ‌కుడు భ‌ళ్లాల‌దేవ‌గా, `ఘాజీ`లో నేవీ ఆఫీస‌ర్ అర్జున్‌గా, `నేనే రాజు నేనే మంత్రి`లో పొలిటీషియ‌న్ జోగేంద్ర‌గా క‌న‌ప‌డ్డాడు.

ఈ ఏడాదిన మ‌ల‌యాళంలో `రాజా మార్తాండ‌వ‌ర్మ‌`గా, తెలుగులో `1948` సినిమాతో పాటు తెలుగు, త‌మిళం, హిందీ భాషల్లో `హ‌థీ మేరే సాథి` సినిమాలో న‌టిస్తున్నాడు. ప్ర‌భు సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌నుంది. థాయ్‌లాండ్‌లో సినిమా ఎక్కువ భాగం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోనుంది. ఈ సినిమాలో రానా మెయిన్ లీడ్‌గా న‌టిస్తుంటే..మెగా హీరో వ‌రుణ్ తేజ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని స‌మాచారం. అంటే ఇదొక మ‌ల్టీస్టార‌ర్‌గా రూపొందుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.