close
Choose your channels

మెగా హీరోకి నాగార్జున అంత రెమ్యునరేషన్ ఇవ్వనున్నడా?

Tuesday, July 6, 2021 • తెలుగు Comments

మెగా హీరోకి నాగార్జున అంత రెమ్యునరేషన్ ఇవ్వనున్నడా?

కింగ్ నాగ్ హీరోగానే కాదు నిర్మాతగా కూడా తెలివైన అడుగులు వేస్తుంటారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగర్జున ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే.

నాగ్ మరోసారి నిర్మాతగా ముందుకు రానున్నారు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో సినిమా తెరకెక్కించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈచిత్రం హాకీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

మెగా హీరోకి నాగార్జున అంత రెమ్యునరేషన్ ఇవ్వనున్నడా?

పృథ్వీ అనే డెబ్యూ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ చిత్రం కోసం నాగ్..వైష్ణవ్ కు ఏకంగా రూ 5 కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నాడు.

వైష్ణవ్ ఉప్పెన చిత్రంతో డెబ్యూ హీరోగా ఘనమైన ఎంట్రీ ఇచ్చాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. దీనితో వైష్ణవ్ కు అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. నాగ్ నిర్మాణంలో తెరకెక్కబోయే క్రేజీ చిత్రం గురించి త్వరలోనే ప్రకటన రానుంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో కూడా వైష్ణవ్ నటిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz