close
Choose your channels

50 హాస్పిటల్స్ కి ఫోన్ చేశా.. డాక్టర్ ఆ మాట చెప్పగానే మైండ్ బ్లాక్ : హంసానందిని

Saturday, May 22, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

50 హాస్పిటల్స్ కి ఫోన్ చేశా.. డాక్టర్ ఆ మాట చెప్పగానే మైండ్ బ్లాక్ : హంసానందిని

కోవిడ్ 19 చిక్కులు సెలెబ్రెటీలకు సైతం తప్పడం లేదు. సామాన్య ప్రజలతో పాటు ఎందరో ప్రముఖులు కరోనా బారీన పడి ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. కొంతమంది కరోనా సోకినప్పటికీ తిరిగి కోలుకుంటున్నారు. క్యారెక్టర్ రోల్స్ చేస్తూ, ఐటెం సాంగ్స్ లో మెరుపులు మెరుపులు మెరిపిస్తూ టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుంది హంసానందిని.

హంసానందిని కుటుంబం కూడా గత నెలలో కరోనా బారీన పడింది. ఆ సమయంలో తానూ మానసికంగా ఎంతో ఒత్తిడిని అనుభవించానని అప్పటి భయంకర అనుభవాలని తాజాగా హంసానందిని పంచుకుంది. తన తండ్రి, గ్రాండ్ మదర్ తో పాటు అంకుల్ కి కూడా కరోనా సోకింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో వీరి ముగ్గురిలో కరోనా లక్షణాలు కనిపించాయి.

ఇదీ చదవండి: మహేష్ భావోద్వేగం.. గ్రేట్ లాస్ అంటున్న చిరు, ఎన్టీఆర్

పరీక్షల్లో కరోనాని నిర్ధారణ అయింది. దీనితో వెంటనే వారిని పూణే నుంచి చికిత్స కోసం ముంబైకి తీసుకువెళ్లా. అందరూ తన కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండమని సలహా ఇచ్చారు. ఆ సమయంలో నా మైండ్ లో ఒక్క ఆలోచన మాత్రమే ఉంది. ముగ్గురిని ఎలాగైనా ఆసుపత్రిలో జాయిన్ చేయాలి.

దీని కోసం దాదాపు 50 ఆసుపత్రులకు ఫోన్ చేశా. చాలా మంది సమాధానం ఇవ్వలేదు. మరికొంతమంది తమ ఆసుపత్రి ఇప్పటికే నిండిపోయి ఉంది అని అన్నారు. ఇంటికి వచ్చి చికిత్స చేసేందుకు కనీసం ఒక డాక్టర్ లేదా నర్సు కోసం కూడా ప్రయత్నించా. కానీ లాభం లేదు. చివరకు రెండు రోజుల తర్వాత ఆసుపత్రి దొరికింది.

మొదట తన అంకుల్ ని ఐసీయూలోకి తీసుకువెళ్లారు. ఆ తర్వాత మా నాన్న ఆరోగ్యం కూడా క్రిటికల్ గా మారింది. ఆయన ఆక్సిజెన్ లెవల్స్ 80 శాతం కంటే పడిపోయాయి. నా తండ్రిని కూడా ఐసీయూలో జాయిన్ చేయాలి అన్నారు. కానీ అక్కడ బెడ్స్ లేవు.

ఆ సమయంలో నాలో తీవ్రంగా మానసిక ఒత్తిడి పెరిగిపోయింది. నేననుభవించిన భయంకర క్షణాలు అవి. కేవలం ఐసీయూలో మాత్రమే కాదు.. ఆక్సిజన్ లెవల్స్ పెరగకపోతే మీ తండ్రిని వెంటిలేటర్ పై కూడా ఉంచాల్సి ఉంటుంది అని డాక్టర్ అన్నారు. వెంటిలేటర్ అనే మాట వినగానే నా మైండ్ బ్లాక్ అయింది. నా బుర్ర పనిచేయలేదు.

డాక్టర్స్ రెమిడెసివర్ ఇంజక్షన్ రికమండ్ చేశారు. ఎంతో కష్టపడి హైదరాబాద్ లో నా ఫ్రెండ్స్ ద్వారా రెమిడెసివర్ తెప్పించాను. నాలుగు రోజుల తర్వాత నుంచి వారి ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది అని హంసానందిని పేర్కొంది.

ఈగ, మిర్చి, సోగ్గాడే చిన్ని నాయన, లౌక్యం లాంటి చిత్రాలు హంసానందినికి మంచి గుర్తింపు తెచ్చాయి. పలు చిత్రాల్లో ఆమె స్పెషల్ సాంగ్స్ చేసింది. హంసానందిని చివరగా తెలుగులో పంతం చిత్రంలో నటించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.