close
Choose your channels

Today Movie Releases : థియేటర్‌లపై చిన్న సినిమాల దండయాత్ర....ఈ రోజు ఎన్ని రిలీజ్‌లో తెలుసా..?

Friday, September 16, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గత కొన్నిరోజులుగా బడా సినిమాలన్నీ థియేటర్లపై దండయాత్ర చేశాయి. వీటిలో జనాన్ని ఆకట్టుకున్నది కొన్నే అయినప్పటికీ.. థియేటర్లు మాత్రం అస్సలు ఖాళీ లేవు. అయితే ఈ నెలలో పెద్ద సినిమాల రిలీజ్‌లు లేకపోవడంతో చిన్ని సినిమాలు సెప్టెంబర్ చివరి వరకు సందడి చేయనున్నాయి. ఇప్పటికే పంజా వైష్ణవ్ తేజ్ నటించిన రంగ రంగ వైభవంగా, జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ పర్యవేక్షణలో రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో , శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో ఒకే ఒక జీవితానికి పాజిటివ్ రివ్యూలతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

అదృష్టం పరీక్షించుకుంటోన్న సుధీర్ బాబు, కిరణ్ అబ్బవరం, వీజే సన్నీ:

ఇకపోతే... సెప్టెంబర్ 16న (శుక్రవారం) చాలా సినిమాలు రిలీజ్‌ పెట్టుకున్నాయి. వీటిలో కిరణ్ అబ్బవరం నటించిన మీకు బాగా కావాల్సిన వాడిని... సుధీర్ బాబు- కృతిశెట్టి నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి... నివేదా థామస్- రెజీనాల శాకిని ఢాకినిలు వీటిలో పెద్దవి, కాస్త పేరున్నవి. . ఇవికాక ఎవరికీ పెద్దగా తెలియని మరో నాలుగైదు సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు కూడా ఈ రోజున రిలీజ్ అవుతున్నాయి. ఇందులో బిగ్‌బాస్ 5 సీజన్ విజేత వీజే సన్నీ నటించిన సకల గుణాభిరామతో పాటు అం అహా మూవీస్ వున్నాయి.

ఇక డబ్బింగ్ చిత్రాల విషయానికి వస్తే:

1. కే3 కోటికొక్కడు
2. ది లైఫ్ ఆఫ్ ముత్తు (శనివారం)
3. ఎవ్రిథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (ఇంగ్లీష్)
4. వేర్ ది క్రౌడ్ సింగ్ (ఇంగ్లీష్)
5. ధాగే (హిందీ)
6. జాహాన్ చార్ యార్ (హిందీ)
7. ఖాల్లీబల్లీ (హిందీ)
8. మట్టూకిసైకాల్ (హిందీ)
9. మిడిల్ క్లాస్ లవ్ (హిందీ)
10. సరోజ్‌కారిష్టా (హిందీ)
11. సియా(హిందీ)

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment