close
Choose your channels

వేగంగా పూర్తవుతున్న ముద్ర క్లైమాక్స్.. డబ్బింగ్ పనులు..

Friday, October 12, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వేగంగా పూర్తవుతున్న ముద్ర క్లైమాక్స్.. డబ్బింగ్ పనులు..

నిఖిల్ హీరోగా తెర‌కెక్కుతోన్న ముద్ర సినిమా షూటింగ్ చివ‌రిద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే ఈ చిత్ర క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతుంది. డ‌బ్బింగ్ ప‌నుల‌ను కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు. వాస్త‌విక సంఘ‌ట‌న‌ల ఆధారంగా జ‌ర్న‌లిజం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సినిమా ఇది. స‌మాజంలో జ‌రుగుతున్న కొన్ని విష‌యాల‌ను ఎలా మీడియా ప‌రిష్క‌రిస్తుంది.. అందులో మీడియా బాధ్య‌త‌ను గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు టిఎన్ సంతోష్. లావ‌ణ్య త్రిపాఠి తొలిసారి నిఖిల్ తో జోడీక‌ట్టింది.

ఈ చిత్రంలో నిఖిల్ జ‌ర్న‌లిస్ట్ అర్జున్ సుర‌వ‌రంగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా మ‌రియు రాజా ర‌వీంద్ర ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి సంస్థ‌ల‌పై కావ్య‌ వేణుగోపాల్, రాజ్ కుమార్ ముద్ర సినిమాను నిర్మిస్తున్నారు. బి మ‌ధు ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా ఉన్నారు. ఈ చిత్రం నవంబర్ లో విడుదల కానుంది

న‌టీన‌టులు: నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.