close
Choose your channels

హీరోగా పరిచయం అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్ మనవడు...

Saturday, February 25, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ద‌క్షిణాదిన ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుల్లో చ‌క్ర‌వ‌ర్తి ఒక‌రు. ఇప్పుడు ఈ దివంగ‌త సంగీత ద‌ర్శ‌కుడి మ‌న‌వ‌డు రాజేష్ శ్రీ చ‌క్ర‌వ‌ర్తి తెలుగులో తెరంగేట్రం చేస్తున్నాడు. హ‌రీష్ వ‌ట్టికూటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న శివ కాశీపురం సినిమాతో చ‌క్ర‌వ‌ర్తి మ‌న‌వ‌డు ఎంట్రీ ఇవ్వ‌న‌న్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. గ్రామీణ నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థా చిత్ర‌మ‌ని ద‌ర్శ‌కుడు హ‌రీష్ వ‌ట్టికూటి తెలియ‌జేశారు.

వ్య‌వ‌సాయ‌రంగానికి చెందిన త‌న‌కు సినిమాలంటే ముందు నుండి ఆస‌క్తి ఉండేది కాబ‌ట్టి, ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చి ఈ సినిమా చేశాన‌ని, త‌న‌కు ఇష్ట‌మైన సంగీత ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తిగారి మ‌న‌వడిని ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం చేయ‌డం ఆనందంగా ఉంద‌ని నిర్మాత మోహ‌న్ బాబు పులి మామిడి తెలిపారు. సినిమా లుక్ చాలా గ్రాండ్ గా ఉంద‌ని, త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చ‌తుంద‌ని హీరో రాజేష్ శ్రీ చ‌క్ర‌వ‌ర్తి తెలిపారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో దిల్ ర‌మేష్, హీరోయిన్ ప్రియాంక శ‌ర్మ పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.