close
Choose your channels

థమన్‌కు ఛాన్సులే ఛాన్సులు..

Saturday, January 11, 2020 • తెలుగు Comments

థమన్‌కు ఛాన్సులే ఛాన్సులు..

ఒక‌ప్పుడు థ‌మ‌న్ పేరు చెబితే సంగీత ప్రియులంద‌రూ పెద‌వి విరిచేవారు. అయితే ఇప్పుడు థ‌మ‌న్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రాణిస్తుండ‌టం విశేషం. అల్లు అర్జున్ తాజా చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమాలోని ‘సామజవరగమన’, `రాములో రాముల‌` పాట‌లు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్న తెలుగు పాట అది. అల వైకుంఠపురములో సినిమా కోసం సంగీత దర్శకుడు థమన్ సృష్టించిన బాణీ.. ఇప్పుడు ప్రతి సంగీత ప్రియుడి ఇష్టమైన ట్యూన్‌గా మారిపోయింది. అవకాశాలు ఆ స్థాయిలోనే వచ్చి చేరుతున్నాయి. అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ రెండు చేతులా పని కల్పిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై ఓ క్లారిటీ రానుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.

తాజాగా థమన్ రెండు తెలుగు సినిమాల కోసం చర్చల్లో ఉన్నాడట. ఓ ప్రముఖ నిర్మాత ఆయనతో డీల్ కుదుర్చుకునేందుకు చర్చిస్తున్నారట. అది ఓకే అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ రీ ఎంట్రీ మూవీ పింక్ రీమేక్‌కు కూడా త‌మ‌నే సంగీతాన్ని అందిస్తున్నాడు. తొలి ప్రేమ‌, అర‌వింద స‌మేత చిత్రాల‌తో త‌మ‌న్ క్రేజ్ డబుల్ అయ్యింది. అల వైకుంఠ‌పుర‌ముతో ఆయ‌న క్రేజ్ ఆకాశాన్నంటింది. దీంతో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మారాడు థ‌మ‌న్‌.

Get Breaking News Alerts From IndiaGlitz