close
Choose your channels

సోషియో ఫాంటసీ కథతో నాగఅన్వేష్...

Friday, February 19, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇప్పుడు రాజ‌మౌళి అసిస్టెంట్స్‌, అసోసియేట్స్ తెలుగు సినిమాల‌పై ద‌ర్శ‌కులుగా దండయాత్ర‌లు ప్రారంభించారు. ఈ ఏడాది జ‌గ‌దీష్ త‌ల‌శిల ల‌చ్చిందేవికి ఓ లెక్కుంది` సినిమాతో ద‌ర్శ‌కుడుగా మారాడు. ఇప్పుడు ఇదే బాట‌లో మ‌రో అసిస్టెంట్ ప‌ళ‌ని కూడా ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం కాబోతున్నాడ‌ట‌. రాజమౌళితో పలు చిత్రాల‌కు ప‌నిచేసిన ప‌ళ‌ని ఓ ల‌వ్‌స్టోరీని డెవ‌లప్ చేస్తున్నాడ‌ట‌. ఈ సినిమాలో వినవ‌య్యా రామ‌య్యా` ఫేమ్ నాగఅన్వేష్ హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడ‌ట‌. సింధూరపువ్వు కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడన్నమాట. మార్చిలో సినిమా ప్రారంభం కానుంది. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఎంజిల్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.