close
Choose your channels

'ఊపిరి' రిలీజ్ డేట్

Saturday, November 7, 2015 • తెలుగు Comments

ఫ్రెంచ్ మూవీ 'ది ఇన్‌ట‌చ‌బుల్స్‌'కి రీమేక్‌గా 'ఊపిరి' సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నాగార్జున‌, కార్తీ హీరోలుగా న‌టిస్తున్న ఈ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్ కాగా.. అనుష్క గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌నుంది. ఇదిలా ఉంటే.. సెల‌బ్రేష‌న్ ఆఫ్ లైఫ్ అనే ట్యాగ్‌లైన్‌తో తెర‌కెక్కిన 'ఊపిరి'లో నాగ్ ది వీల్ ఛైర్‌కి ప‌రిమిత‌మ‌య్యే పాత్ర అయితే.. సినిమాకి ఊపిరిగా నిలిచే పాత్ర మాత్రం కార్తీదేన‌ట‌.

నాగార్జున పాత్ర‌కి సేవ‌లు చేస్తూ.. సినిమా ఆద్యంతం హుషారుగా సాగే కార్తీ పాత్ర సినిమాకే హైలెట్ అని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని తెలుగులో ఫిభ్రవరి 5న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. అప్పుడైతే ఏ చిత్రాలు పోటీలో ఉండవనేది నిర్మాతలు ఆలోచన కాబోలు...