close
Choose your channels

బాల‌య్య నాలుగో కామెంట్ : ఎవ‌రూ నెత్తిన పెట్టుకోమ‌న్నారు

Tuesday, January 8, 2019 • తెలుగు Comments

బాల‌య్య నాలుగో కామెంట్ : ఎవ‌రూ నెత్తిన పెట్టుకోమ‌న్నారు

లేపాక్షి ఉత్స‌వాల సందర్భాల్లో చిరంజీవి ఎందుకు పిల‌వ‌లేద‌ని మీడియా వాళ్లు అడిగిన‌ప్పుడు .. మా గ్లామ‌ర్ చాలు. ఎవ‌డినో తెచ్చి నెత్తిన పెట్టుకోను. నా డిక్టేట‌ర్ ప‌ద్ధ‌తిలో ముందుకెళ‌తాను.. అంటూ బాల‌య్య మీడియా వాళ్ల‌తో చెప్పాడు. దానిపై నాగ‌బాబు స్పందిస్తూ ``మిమ్మ‌ల్ని నెత్తిన పెట్టుకోమ‌ని చిరంజీవిగారు ఏమైనా చెప్పారా.. మా వాళ్లు కానీ.. ఫ్యాన్స్ కానీ చెప్పారా.

నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడుతారా? అంత నోటి దురుసేంటి?  నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడుతారా?  మీ గ్లామ‌ర్ మీరే ఉంచుకోండి. ఎమ్మెల్యేగా అయ్యుండి, డిక్టేట‌ర్‌లా ప్ర‌వ‌ర్తిస్తారా?  చూద్దాం నెక్ట్స్ ఎల‌క్ష‌న్స్‌లో ఏమ‌వుతుందో, గెల‌వండి అదే హిందూపూర్‌లో. మా అన్న‌య్య‌, త‌మ్ముడు శాంతిప‌రులం. 

ఎవ‌రు ఎన్ని మాట‌లు మాట్లాడినా, మేం ఏమీ అన‌లేదు క‌దా!. మేం కంట్రోల్‌గా ఉంటున్నాం కానీ.. మీరు కంట్రోల్‌గా లేరు. మీరు అపాయింట్ చేసిన వ్య‌క్తులు కంట్రోల్‌గా లేరు. మీరు మీడియాలో మాట్లాడించిన వ్య‌క్తులు కంట్రోల్‌గా లేరు. వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను మాట్లాడుతున్నారు. మీ వాళ్ల‌తో చాలా దుర్మార్గంగా మాట్లాడించారు. ఆయ‌న స‌రే మేం నోరు మూసుకున్నాం. కామెంట్ చేయ‌లేదు`` అన్నారు. 

Get Breaking News Alerts From IndiaGlitz