close
Choose your channels

హ్యాపీ బర్త్ డే టూ నాగశౌర్య.. పుట్టినరోజు కానుకగా ‘కృష్ణ వ్రింద విహారి’ ఫస్ట్‌లుక్

Saturday, January 22, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హ్యాపీ బర్త్ డే టూ నాగశౌర్య.. పుట్టినరోజు కానుకగా ‘కృష్ణ వ్రింద విహారి’ ఫస్ట్‌లుక్

హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నారు యంగ్ హీరో నాగశౌర్య. కొత్తదనం నిండిన కథలతో యువతను ఆకట్టుకుంటున్నారాయన. గతేడాది వరుడు కావలెను సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ వెంటనే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌‌లో వచ్చిన లక్ష్యతో సైతం నాగశౌర్య ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ నాగశౌర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్‌లను అనౌన్స్ చేశారు. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘‘కృష్ణ వ్రింద విహారీ’’ అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

హ్యాపీ బర్త్ డే టూ నాగశౌర్య.. పుట్టినరోజు కానుకగా ‘కృష్ణ వ్రింద విహారి’ ఫస్ట్‌లుక్

అనీశ్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాతో షిర్లే సేతియా హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రాధిక, ‘వెన్నెల’కిశోర్, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ, సత్య తదతరులు ఇందులో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. కృష్ణ, వ్రింద మధ్య సాగే ప్రేమ ప్రయాణమే ఈ సినిమా. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌ లో శౌర్య ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు.

నిలువు బొట్టు, గంధం, చేతిలో ఇత్తడి చెంబు, మావిడాకులు చూస్తుంటే ఇందులో శౌర్య బ్రాహ్మణుడి గెటప్‌లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. టైటిల్ ప్రకారం.. ఇందులో కృష్ణ అనే క్యారెక్టర్ పోషించబోతున్నారట నాగశౌర్య. మరి ఈ గెటప్‌లో ఆయన ఎలా ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.