close
Choose your channels

Janasena : 'నా సేన కోసం నా వంతు'ని ప్రారంభించిన నాగబాబు.. యూపీఐ ద్వారా సింపుల్‌గా విరాళాలివ్వొచ్చు

Friday, August 26, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కుల, మతాలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తోన్న జనసేనకు అండగా నిలిచేందుకు 'నా సేన కోసం నా వంతు' కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు. గురువారం జనసేన కేంద్ర కార్యాలయంలో 7288040505 @icici అనే UPI ఐడికి స్వచ్ఛందంగా విరాళం అందించి ఆయన ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం నాగబాబు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగస్వాములై జనసేనకు స్వచ్చంద విరాళాలు అందించే వారికి అవగాహన కల్పించాలన్నారు.

పవన్‌ని కుటుంబ సభ్యుడిలా భావించండి:

స్వశక్తినే నమ్ముకుని జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ తమ స్వార్జితంతోనే పార్టీని నడిపిస్తున్నారని, ఆయనకు స్వచ్ఛంద విరాళాల ద్వారా తోడ్పాటు అందిస్తే పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగకరంగా వుంటుందని నాగబాబు పేర్కొన్నారు. పార్టీకి అండగా మన వంతుగా బాధ్యతగా విరాళాలు అందించేందుకు ఈ కార్యక్రమం రూపొందించామని ఆయన తెలిపారు. ప్రతీ జన సైనికుడిని, వీర మహిళను కుటుంబ సభ్యులుగా భావించే పవన్ కళ్యాణ్‌ని మనమూ కుటుంబ సభ్యుడిగా భావించి అండగా నిలబడదామని నాగబాబు పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాల ప్రయోజనం కోసం పనిచేస్తున్న జనసేనకు స్వచ్ఛందగా విరాళాలు ఇచ్చి ప్రోత్సాహిద్దామన్నారు.

నా సేన కోసం నా వంతు ప్రత్యేక కమిటీ

ఈ సందర్భంగా ‘‘ నా సేన కోసం నా వంతు కార్యక్రమం’’ నిర్వహణ కోసం 32 మందితో కూడిన కమిటీని నాగబాబు ప్రకటించారు. కమిటీ చైర్మన్ గా బొంగునూరి మహేందర్ రెడ్డి, కన్వీనర్ గా తాళ్లూరి రామ్, కో కన్వీనర్లుగా రుక్మిణీ కోట, టి.సి.వరుణ్, కో ఆర్డినేషన్ కమిటీలో సోషల్ మీడియా విభాగం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఐ.టీ. విభాగం నుంచి పసుపులేటి సంజీవ్, ఎన్.అర్.ఐ. భాస్కర్, సాయి రాజ్ కె., సతీశ్ రెడ్డి, క్రాంతి కిరణ్, పవన్ కిషోర్, గిరిధర్, రవి కుమార్, ఏరియా కో ఆర్డినేటర్లుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ముఖ్యమైన సభ్యులు ఉంటారని నాగబాబు చెప్పారు.

రూ. 10 నుంచి ఎంతైనా విరాళంగా :

క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న అందరితో మమేకమై ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆయన కమిటీ సభ్యులకు సూచించారు. 3.5 లక్షల జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు, ఐటీ విభాగం, స్వచ్ఛందంగా పని చేస్తున్న సోషల్ మీడియా విభాగం, జనసేన ఎన్.అర్.ఐ. విభాగం, జిల్లా, అసెంబ్లీ, మండల, వార్డు ఇంఛార్జిలు, జనసేన పార్టీ వివిధ అనుబంధ విభాగాలు, వైద్యులు, వ్యాపారస్తులు, వీరమహిళా విభాగం, గృహిణులు, మహిళా ఉద్యోగులు, యువత, విద్యార్థులు, జనసేన పార్టీ శతగ్ని, పార్టీ అధికార ప్రతినిధులు తదితర విభాగాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉంటారని నాగబాబు చెప్పారు. జనసేన పార్టీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం అయిన 7288040505 @icici అనే UPI ఐడి (గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్) ప్రక్రియ ద్వారా చాలా సులభంగా కనీసం రూ.10 నుంచి ఎంత మొత్తాన్నైనా పార్టీకి విరాళంగా అందించవచ్చని నాగబాబు వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.