close
Choose your channels

కొత్త ద‌ర్శ‌కుడితో నాగ్‌.. అస‌లు ట్విస్ట్ అదే!

Wednesday, November 6, 2019 • తెలుగు Comments

కొత్త ద‌ర్శ‌కుడితో నాగ్‌.. అస‌లు ట్విస్ట్ అదే!

రియాలిటీ షో బిగ్‌బాస్ 3ను కింగ్ నాగార్జున విజ‌య‌వంతంగా పూర్తి చేశాడు. ఇప్పుడు ఆయ‌న త‌న ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టాడ‌ట‌. ప్ర‌స్తుతం సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు నాగార్జున ఊపిరి చిత్రానికి ర‌చ‌నా శాఖ‌లో ప‌నిచేసిన రైట‌ర్ సాల్మ‌న్ చెప్పిన క‌థ‌కు ఇంప్రెస్ అయ్యాడ‌ట‌. సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలోనే నాగ్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాక్‌.సాధార‌ణంగా నాగార్జున కొత్త‌వారిని ఎంక‌రేజ్ చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటాడు. ఆ కోవ‌లోనే ఓ రైట‌ర్‌ని డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌. 

ఇక్కడ ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ సినిమాలో నాగార్జున హీరో కాద‌ట‌.  ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తాడ‌ట‌. క‌థంతా ఆయ‌న చుట్టూనే తిరుగుతుంద‌నేది స‌మాచారం. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమా గురించి ప్ర‌క‌ట‌న రావ‌చ్చు. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు నాగ్ హోల్డ్‌లో పెట్టిన క‌ల్యాణ్ కృష్ణ సంగ‌తేంటో చూడాలి.

నాగార్జునకు ఆయ‌న గ‌త చిత్రాలు షాక్‌నిచ్చాయి. ఆయ‌న హీరోగా చేసిన ఆఫీస‌ర్‌, నానితో చేసిన మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్‌, రీసెంట్‌గా విడుద‌లైన మన్మ‌థుడు 2 బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూశాయి. దీంతో త‌దుప‌రి సినిమా విష‌యంలో నాగ్ కాస్త స‌మ‌యం తీసుకున్నాడు. ఆలోపు రియాలిటీ షో బిగ్‌బాస్‌ను పూర్తి చేశాడు. 

Get Breaking News Alerts From IndiaGlitz