close
Choose your channels

బిగ్‌బాస్ 4 కోసం నాగ్ రెడీ అయిపోతున్నారోచ్‌!!

Saturday, August 1, 2020 • తెలుగు Comments

బిగ్‌బాస్ 4 కోసం నాగ్ రెడీ అయిపోతున్నారోచ్‌!!

బిగ్‌బాస్ 4 కోసం నాగ్ రెడీ అయిపోతున్నారోచ్‌!!..ఇది అక్కినేని నాగార్జున అభిమానుల‌కే కాదు.. సినీ ప్రియుల‌లంద‌రికీ శుభ‌వార్తే. ఎందుకంటే లాక్‌డౌన్ కార‌ణంగా అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన స‌మ‌యంలో అంద‌రికీ సినిమాలు లేక‌పోవ‌డంతో టీవీలు, ఓటీటీ ప్ర‌ధాన ఎంట‌ర్‌టైనింగ్ మాధ్య‌మాలుగా మారాయి. ఈ క్ర‌మంలో తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 కోసం రంగం సిద్ధ‌మ‌వుతోంది. సీజ‌న్ 3కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన బిగ్‌బాస్ 4కు కూడా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నార‌నే దానిపై ముందు చాలా పేర్లు వినిపించిన‌ప్ప‌టికీ నిర్వాహ‌కులు మాత్రం నాగార్జున‌నే క‌న్‌ఫ‌ర్మ్ చేశారు.

ఇప్పుడు తాను బిగ్‌బాస్ 4 చేయ‌బోతునట్లు నాగార్జున క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. ‘‘మళ్లీ తిరిగి షూటింగ్‌కు వ‌చ్చేశాను. లైట్స్, కెమెరా, యాక్ష‌న్‌.. ఏం అద్భుతం.. నిజంగా ఏదో అద్భుతమే’’ అని నాగార్జున ట్వీట్ చేశారు. అంతే కాకుండా పిపిఈ కిట్స్ ధిరించిన మేక‌ప్‌మేన్‌లు నాగార్జున‌కు మేక‌ప్ చేస్తున్నారు. బిగ్‌బాస్ 4 యాడ్ కోసం నాగార్జున షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్న‌పూర్ణ స్టూడియోలో వేసిన సెట్‌లో ఈ యాడ్ షూటింగ్ జ‌రిగింది. క‌ల్యాణ్ కృష్ణ ఈ యాడ్‌ను షూట్ చేశారు. కె.కె.సెంథిల్‌కుమార్ కెమెరా మేన్‌గా వ‌ర్క్ చేశారు. త్వ‌ర‌లోనే బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్‌పై నిర్వాహ‌కులు ఓ నిర్ణ‌యం తీసుకుంటార‌ట‌. క‌రోనా ఉన్న ప్ర‌స్తుత స‌మయంలో షూటింగ్‌ల‌కు ప్ర‌భుత్వ సూచించిన‌ విధి విధానాల‌ను ఫాలో అవుతూ బిగ్‌బాస్ 4ను చిత్రీక‌రించ‌నున్నారు. మ‌రి ఎప్పుడు బిగ్‌బాస్ 4 ప్ర‌సారం కానుంద‌నే దానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

Get Breaking News Alerts From IndiaGlitz