close
Choose your channels

నాగ్‌, వ‌ర్మ టైటిల్స్ ఇవి..

Monday, December 4, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శివ చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కాంబినేష‌న్ కింగ్ నాగార్జున‌, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఆ త‌రువాత వ‌చ్చిన అంతం, గోవిందా గోవింద ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. దాదాపు 24 ఏళ్ల త‌రువాత వీరి క‌ల‌యిక‌లో మ‌రో సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌లే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమాలో నాగ్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. నాగ్ కి జోడీగా కొత్త హీరోయిన్ మైరా స‌రీన్ న‌టిస్తోంది. కాగా, ఈ సినిమాకి మూడు టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఆ టైటిల్స్ ఏమిటంటే.. గ‌న్‌, సిస్ట‌మ్‌, శ‌ప‌థం.

వీటిలో గ‌న్ టైటిల్ వైపే నాగ్‌, వ‌ర్మ ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ వ‌స్తుంది. వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 20న ఈ సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

24 ఏళ్ల త‌రువాత నాగార్జున‌, రామ్ గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. శివ మ్యాజిక్‌ని ఈ చిత్రం రిపీట్ చేస్తుంద‌ని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.