close
Choose your channels

కొత్త త‌ర‌హా మేన‌రిజ‌మ్స్‌తో నాని?

Monday, May 7, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొత్త త‌ర‌హా మేన‌రిజ‌మ్స్‌తో నాని?

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఓ మల్టీస్టారర్ మూవీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 'భలే మంచి రోజు', 'శమంతకమణి' లాంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ మల్టీస్టారర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

నాగ్ సరసన ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నానితో కలిసి రష్మిక మందన్న తెర‌ను పంచుకోనుంది. కాగా.. ఈ సినిమాలో నాగ్  గ్యాంగ్‌స్ట‌ర్‌ పాత్రలో నటిస్తుండగా.. నాని డాక్టర్ పాత్రలో అలరించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నాని పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందని సమాచారం. తన బాడీ లాంగ్వేజ్‌కి కొత్త త‌ర‌హా మేనరిజమ్స్ తోడై చాలా హిలేరియ‌స్‌గా ఈ పాత్ర ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఓ విధంగా నాని ఈ పాత్రను ఒప్పుకోవడానికి అదే కారణమని చెబుతున్నారు.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి "మెలోడీ బ్రహ్మ" మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. జూలై కల్లా షూటింగ్ పూర్తి చేసి.. ఆగష్టులో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.