close
Choose your channels

న‌య‌న్‌... ఫెస్టివ‌ల్ హీరోయిన్‌

Monday, October 7, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

న‌య‌న్‌... ఫెస్టివ‌ల్ హీరోయిన్‌

త‌మిళ‌నాట లేడీ సూప‌ర్ స్టార్‌గా రాణిస్తోంది న‌య‌న‌తార‌. అంతేకాదు.. ద‌క్షిణాది అన్ని భాష‌ల్లోనూ విజ‌యాలు చూసిన ఈ ముద్దుగుమ్మ‌... ఒక‌వైపు హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌తో మురిపిస్తూనే, మ‌రోవైపు స్టార్ హీరోల ప‌క్క‌న కూడా సంద‌డి చేస్తోంది. ఇదిలా ఉంటే.. స్టార్ హీరోల స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టిస్తున్న సినిమాల‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఉంది. అదేమిటంటే.. ఆయా చిత్రాలు ఫెస్టివ‌ల్ సీజ‌న్స్‌లోనే రిలీజ్ అవుతున్నాయి.

వివ‌రాల్లోకి వెళితే, ఈ ద‌స‌రా సీజ‌న్‌లో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా న‌య‌న‌తార న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి` విడుద‌ల కాగా.. దీపావ‌ళి సీజ‌న్‌లో కోలీవుడ్ స్టార్ విజ‌య్‌కి జంట‌గా న‌టించిన `బిగిల్‌` రిలీజ్ కాబోతోంది. అట్లీకుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా.. తెలుగులో `విజిల్‌` పేరుతో అనువాదం కానుంది. ఇక‌.. చాన్నాళ్ళ త‌రువాత సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌తో న‌య‌న‌తార న‌టిస్తున్న `ద‌ర్బార్‌` విష‌యానికి వ‌స్తే.. ఎ.ఆర్‌. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ సంక్రాంతి కానుక‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకే రోజున విడుద‌ల కానుంది.

మొత్తానికి.. ద‌స‌రా, దీపావ‌ళి, సంక్రాంతి.. ఇలా పండ‌గ సీజ‌న్స్ లోనే న‌య‌న‌తార బిగ్ టికెట్ ఫిల్మ్స్ వ‌రుస‌గా విడుద‌ల‌వుతుండ‌డం విశేషం. `సైరా` విజ‌యం సాధించిన నేప‌థ్యంలో... `విజిల్‌`, `ద‌ర్బార్‌` కూడా అదే బాట‌లో వెళ‌తాయేమో చూద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.