close
Choose your channels

స్మగ్లర్‌గా న‌య‌న‌తార‌

Friday, May 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్మగ్లర్‌గా న‌య‌న‌తార‌

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజీ ప్రాజెక్ట్స్‌ను ఎంపిక చేసుకుంటూ.. వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందులో 'ఇమైక్క నోడిగల్' సినిమా నిర్మాణానంతర పనులను జరుపుకుంటుండగా.. మిగిలిన సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

వాటిలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్న తెలుగు చిత్రం 'సైరా నరసింహారెడ్డి' ఒకటి. అలాగే.. అజిత్‌తో క‌లిసి 'విశ్వాసం' అనే సినిమాలో కూడా న‌టిస్తోంది నయన్. ఇదిలా ఉంటే.. ఈమె నటిస్తున్న తమిళ సినిమాల్లో 'కొలమావు కోకిల' ఒకటి. హీరోయిన్ ఒరియెంటెడ్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఆర్ధికపరమైన సమస్యలతో సతమతమవుతున్న ఓ మహిళ.. మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసే ఇతివృత్తంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలను సమకూరుస్తున్నారు. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.