close
Choose your channels

NBK's Unstoppable 2 : బతికున్నా కాబట్టే సీఎం అయ్యా.. బాంబు పేల్చిన కిరణ్,  ఫ్రెండ్స్‌తో బాలయ్య సందడి

Friday, November 18, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీ సంస్థ ‘‘ఆహా’’లో ప్రసారమవుతోన్న ‘‘అన్‌స్టాపబుల్ 2’’కు మంచి రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. బాలయ్య ఇంటర్వ్యూ చేసే విధానం, ఆయన అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తొలి సీజన్‌లో కేవలం సినీ తారలను మాత్రమే పిలిచిన ఆహా నిర్వాహకులు.. సీజన్‌ 2లో మాత్రం రాజకీయ నాయకులను గెస్ట్‌లుగా పిలుస్తున్నారు. అన్‌స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్ గెస్ట్‌గా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఆయన కుమారుడు నారా లోకేశ్ వచ్చారు. ఈ సందర్భంగా 1995లో టీడీపీలో చోటు చేసుకున్న వెన్నుపోటు ఎపిసోడ్‌కు సంబంధించిన విశేషాలు హైలెట్‌గా నిలిచాయి.

అన్‌స్టాపబుల్ 2కి గెస్ట్‌లుగా కిరణ్ కుమార్ రెడ్డి, సురేశ్ రెడ్డి:

రాజకీయ నాయకుల ఎపిసోడ్లకు మంచి వ్యూయర్‌షిప్ వస్తుండటంతో ఆహా నిర్వాహకులు నాలుగో ఎపిసోడ్‌కి మళ్లీ ఇద్దరు పొలిటీషియన్స్‌ని పిలిచారు. వారు ఎవరో కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి. వీరిద్దరూ బాలకృష్ణ క్లాస్‌మెట్స్ కావడం విశేషం. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను గురువారం విడుదల చేశారు.

అధ్యక్షా.. నా మైక్ ఆపేశారు .. కిరణ్‌పై బాలయ్య పంచ్‌లు :

ఇందులో.. కిరణ్ వేదిక మీదకు వచ్చిన వెంటనే ‘‘అధ్యక్షా.. నా మైక్ ఆపేశారు అధ్యక్ష’’ అంటూ ఆటపట్టించారు బాలయ్య. దీనికి కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ... తాను స్పీకర్ అయిన తర్వాత ఓ రోజు అర్ధరాత్రి 12 గంటలకు బాలయ్య ఫోన్ చేసి ఇదే మాట్లాడారని అన్నారు. ఆ వెంటనే సురేశ్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. కిరణ్ ఔట్ స్టాండింగ్ క్రికెటర్ అని అనగా.. తాను ఔట్ స్టాండింగ్ స్టూడెంట్‌నని అంటే ఎక్కువగా క్లాస్ బయటే వుండేవాడినని సురేశ్ అన్నారు. అమ్మాయిలకు సైట్స్ కొట్టేందుకు తాము బైక్స్ ఎక్స్‌ఛేంజ్ చేసుకునేవాళ్లమని బాలయ్య గుర్తుచేసుకున్నారు. ఆ వెంటనే ఆ ఫీల్డులో బాలయ్య, సురేశ్ రెడ్డి హీరోలు అంటూ పంచ్ వేశారు కిరణ్ కుమార్ రెడ్డి.

బతికి వున్నా కాబట్టే సీఎం అయ్యా : కిరణ్ కుమార్ రెడ్డి

షో సరదాగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా సీరియస్ క్వశ్చన్ వేశారు బాలయ్య. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి మరణం గురించి ప్రస్తావించారు. తాను బతికి వున్నాను కాబట్టి సీఎంను అయ్యానంటూ కిరణ్ బాంబు పేల్చారు. ఓ సీనియర్ మినిస్టర్ .. వైఎస్‌ని మిస్ లీడ్ చేసేవారంటూ ఇంకేదో సంచలన విషయాన్ని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. వైఎస్ లాంటి గొప్ప నాయకుడిని మనం కోల్పోయామని వ్యాఖ్యానించారు. దీంతో వేదికపై వున్నవారు, ప్రేక్షకులు చప్పట్లతో మారుమోగించారు.

చిరంజీవిలో నచ్చిందేంటీ.. నాలో నచ్చనిదేంటీ :

తర్వాత బాలయ్య బౌలింగ్ వేయగా కిరణ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేశారు. మధ్యలో సీనియర్ హీరోయిన్ రాధిక ఎంట్రీ ఇచ్చారు. అంపైర్ లేకుండా క్రికెట్ ఏంటీ అంటూ సందడి చేశారు. తర్వాత బాలయ్యను రాధిక ఏదో ప్రశ్న అడగ్గా.. దీనికి ఆన్సర్ ఇస్తే బాలకృష్ణ ఇంటికి వెళ్లరని, వెళ్లినా ఇంట్లో భోజనం వుండదని పంచ్ వేశారు. అనంతరం నువ్వు కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్ కాంత్, అమితాబ్‌లతో చేశావు.. నా లాంటి సూపర్‌స్టార్‌తో నీకు ఛాన్స్ రాలేదంటూనే.. చిరంజీవిలో నీకు నచ్చినదేంటీ, నాకు నచ్చనిదేంటీ అని ప్రశ్నించి రాధికను సందిగ్థంలో పడేశారు బాలయ్య. మొత్తానికి ప్రోమో ఓ రేంజ్‌లో వుంది. మరి మిగిలిన విషయాలు తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూసేయడమే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Login to post comment
Cancel
Comment