close
Choose your channels

నాగ్ సరసన కొత్త భామ...

Wednesday, August 5, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ హీరోలుగా సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ పి.వి.పి. పతాకంపై మున్నా, బృందావనం, ఎవడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ప్రసాద్‌ వి. పొట్లూరి ప్రొడక్షన్‌ నెం.9గా నిర్మిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ప్రస్తుతం పారిస్ లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.

ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రంలో మిస్ ఐపిఎల్ 2009 కంటిస్ టెంట్, సౌతాఫ్రికా మోడల్ గాబ్రియాలా డిమేట్రియాడెస్ కూడా ఈ యూనిట్ లో చేరింది. మల్టీస్టారర్ గా స్టార్టయిన ఈ చిత్రంలో అనుష్క గెస్ట్ రోల్ లో కనపించనుంది. తాజాగా గాబ్రియాలా డిమేట్రియాడెస్ చేరింది. అల్రెడి నాగ్, తమన్నా, కార్తీ ఉండనే ఉన్నారు. అందరి చేరికతో సినిమా స్పాన్ పెరిగింది. ఈ చిత్రానికి మిత్రులు` అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.