close
Choose your channels

40కోట్ల క్లబ్ లో నితిన్...

Thursday, June 16, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త్రివిక్రమ్ దర్శకత్వ మాయతో హీరో నితిన్ కు అఆ చిత్రం కెరీర్ బ్లాక్ బస్టర్ చిత్రమయ్యింది. కలక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద సత్తాను చాటుతుంది. నితిన్ ను అఆ నలభై కోట్ల క్లబ్ హీరోగా నిలబెట్టింది. ముఖ్యంగా ఓవర్ సీస్ 2.5 మిలియన్ డాలర్స్ ను కలెక్ట్ చేసి టాప్ 4 లో నిలిచింది. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో 27కోట్లకు పైగా షేర్ సాధించిన ఈ చిత్రం ఓవర్ సీస్ లో 10 కోట్ల షేర్ సాధించింది. మిగిలిన రాష్ట్రాల్లో మూడు కోట్ల షేర్ సాధించింది. మొత్తం మీద 40 కోట్ల షేర్ సాధించి నితిన్ మార్కెట్ స్థాయిని పెంచిన చిత్రమైంది. నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం విడుదలైన రోజు నుండే పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.