close
Choose your channels

ఆ వార్త‌ల్లో నిజం లేదట‌!!

Wednesday, July 8, 2020 • తెలుగు Comments

ఆ వార్త‌ల్లో నిజం లేదట‌!!

పెద్ద స‌పోర్ట్ లేకుండా ఇండ‌స్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక‌రు. ప్ర‌స్తుతం ఈ యువ క‌థానాయ‌కుడు డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఫైట‌ర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ యూత్ స్టార్ గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదేంటంటే బాగా పాపులారిటీ సంపాదించుకున్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4కు విజ‌య్ దేవ‌ర‌కొండ హోస్ట్ చేస్తాడ‌ని.

బిగ్‌బాస్ మూడు సీజ‌న్స్‌కు ముగ్గురు వ్యాఖ్యాత‌లుగా వ‌ర్క్ చేశారు. ఎన్టీఆర్‌, నాని, నాగార్జున మూడు సీజ‌న్స్‌ను హోస్ట్ చేశారు. మ‌రి నాలుగో సీజ‌న్‌ను ఎవ‌రు హోస్ట్ చేస్తార‌నే దానిపై క్లారిటీ లేదు. కానీ నాగార్జున‌, స‌మంత స‌హా చాలా పేర్లు వినిపించాయి. తాజాగా ఈ లిస్టులో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు చేరింది. కానీ విజ‌య్ స‌న్నిహిత వ‌ర్గాలు మాత్రం ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని కొట్టి పారేశారు. బిగ్‌బాస్ సీజ‌న్‌3ని హోస్ట్ చేసిన సీనియ‌ర్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని, నాలుగో సీజ‌న్‌ను కూడా హోస్ట్ చేస్తార‌ని స‌మాచారం. కానీ అధికారిక ప్ర‌క‌టన మాత్రం రాలేదు. బిగ్‌బాస్ సీజ‌న్ 4 ఆగ‌స్ట్‌లో ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు పాటించేలా పక్కా ప్లానింగ్‌తో ప్రారంభం కానుంద‌ని టాక్‌.

Get Breaking News Alerts From IndiaGlitz