close
Choose your channels

'బిగ్ బాస్' లో మళ్లీ ఎన్టీఆర్‌

Monday, April 9, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్ బాస్ లో మళ్లీ ఎన్టీఆర్‌

తొలిసారిగా 'మా టీవి' నిర్వహించిన 'బిగ్ బాస్' రియాల్టీ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్‌కి హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్.. ఈ షో హిట్ అవడానికి ప్రధాన కారణంగా నిలిచారు. హోస్ట్‌గా త‌న మాట తీరుతో  తారక్ ప్రేక్షకులను ఎంత‌గానో ఆకట్టుకున్నారు.

అయితే.. రెండో సీజన్‌కి కూడా తారక్ వ్యాఖ్యాతగా ఉంటారని అంతా ఆసక్తితో ఎదురుచూశారు. కాని త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి సినిమాలు ఉండడంతో పాటు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాని వీలైనంత తొందరగా ముగించాలనే ఉద్దేశ్యంతో సెకండ్ సీజన్‌కి దూరమయ్యారు యంగ్ టైగర్.

సినిమా షూటింగ్ వలన రెండో సీజన్‌ను హోస్ట్ చేయలేనని తారక్ చెప్పడంతో.. ఇప్పుడు ఎన్టీఆర్ స్థానంలో నేచురల్ స్టార్ నాని ఈ ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేయనున్నారు. దీని పై అధికారికంగా ఒప్పందం కుద‌రాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. మూడో సీజన్‌కి మ‌ళ్లీ ఎన్టీఆర్ అందుబాటులో ఉంటారని మా టీవి నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. అంటే.. ఈ ఒక్క సీజ‌న్ కోస‌మే నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌న్న మాట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.