close
Choose your channels

'సీతారామ‌రాజు'తో 'ఊపిరి'కి లింకేంటి?

Monday, November 9, 2015 • తెలుగు Comments

అక్కినేని కుటుంబంలో రెండో త‌రం న‌టుడు నాగార్జున‌.. నంద‌మూరి ఫ్యామిలీలో రెండో త‌రం న‌టుడు హ‌రికృష్ణ క‌లిసి న‌టించిన సినిమాగా 'సీతారామ‌రాజు'కి ప్ర‌త్యేక స్థానం ఉంది. 1999లో విడుద‌లైన ఈ సినిమా ఇరు కుటుంబాల అభిమానుల‌నే కాదు.. స‌గ‌టు తెలుగు ప్రేక్ష‌కుల‌ను సైతం అల‌రించింది.

ఆ సినిమాకి ముందు, త‌రువాత కూడా నాగ్ కొన్ని మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లో న‌టించినా.. 'ఊపిరి'ని మాత్రం 'సీతారామ‌రాజు'తో లింక్ చేస్తున్నారు ప‌రిశీల‌కులు.  అందుకు కార‌ణం లేక‌పోలేదు. అదేమిటంటే.. 'ఊపిరి'కి వినిపిస్తున్న రిలీజ్ డేట్ ఫిబ్ర‌వ‌రి 5నే.. 'సీతారామ‌రాజు' కూడా విడుద‌లై విజ‌యం సాధించి ఉండ‌డం. మ‌రి 'సీతారామ‌రాజు' స‌క్సెస్ సెంటిమెంట్ 'ఊపిరి'కి కూడా కంటిన్యూ అవుతుందేమో చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz