close
Choose your channels

'బాహుబ‌లి2'కి నాని డైరెక్ష‌న్‌..

Thursday, June 23, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రీసెంట్‌గా విడుద‌లైన జెంటిల్‌మ‌న్` చిత్రంతో మ‌రో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్న హీరో నాని ఇప్పుడు విరించివ‌ర్మ, జెమిని కిర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ సినిమా ద‌గ్గ‌ర‌లోనే బాహుబ‌లి2` చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.

ఈగ సినిమా నుండి రాజ‌మౌళితో నానికి మంచి రిలేష‌న్ ఉంది. ఈ కార‌ణంగా త‌న సినిమా షూటింగ్ అయిపోయిన త‌ర్వాత నాని బాహుబ‌లి2 షూటింగ్ ప్లేస్‌లోకి వెళ్ళి అక్క‌డ యూనిట్ స‌భ్యుల‌ను క‌లిశాడ‌ట‌. మాటా మంతీ త‌ర్వాత ఓ చిన్న షాట్‌కు నాని డైరెక్ష‌న్ చేశాడ‌ట‌. నాని రెడీ..యాక్షన్ అనే సన్నివేశాన్ని తెలియ‌జేస్తూ బాహుబ‌లి2 టీం చిన్న వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా నాని జెంటిల్‌మ‌న్ స‌క్సెస్‌కు అభినంద‌న‌లను కూడా బాహుబ‌లి2 యూనిట్ నుండి అందుకున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.