Padma Awards 2023 : సంగీత దర్శకుడు కీరవాణికి పద్మశ్రీ


Send us your feedback to audioarticles@vaarta.com


రిపబ్లిక్ డేను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. వీరిలో 91 మందికి పద్మశ్రీ, ఆరుగురికి పద్మ విభూషణ్, తొమ్మిది మందికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది ప్రముఖులకు పద్మ అవార్డ్లు దక్కాయి. ఇక సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ పురస్కారం దక్కడం విశేషం. వీరి కుటుంబం నుంచి ఆయన సోదరుడు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి ఇప్పటికే పద్మశ్రీ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే.
తెలుగు పద్మాలు వీరే:
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి, కమలేశ్ డీ పటేల్‌లకు పద్మభూషణ్.. మోదడుగు విజయ్ గుప్తా, పసుపులేని హనుమంతరావు, బీ రామకృష్ణారెడ్డి, గణేశ్ నాగప్ప, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, సీవీ రాజు, కోట సచ్చిదానంద శాస్త్రి, సంకురాత్రి చంద్రశేఖర్, ప్రకాశ్ చంద్రసూద్లకు పద్మశ్రీ అవార్డ్ దక్కింది.
ఇటీవలే కీరవాణికి గోల్డెన్ గ్లోబ్:
కాగా.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన సోదరుడు , సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో కలిసి టాలీవుడ్‌ని మరో మెట్టెక్కించిన సంగతి తెలిసిందే.జక్కన్న దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ చిత్రంలోని ‘‘నాటు నాటు’’ పాటకు ప్రపంచ ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటుకు ఈ పురస్కారం దక్కింది. దీంతో టాలీవుడ్ సంబరాల్లో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీమ్‌కి, దర్శకుడు కీరవాణికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రపంచ వేదికపై ఈ అవార్డ్‌ను అందుకుని కీరవాణి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.