close
Choose your channels

'గని' నుంచి రోమియో జూలియట్‌‌ సాంగ్.. ఫిబ్రవరి 8న ముహూర్తం, పాడింది ఎవరో తెలుసా..?

Saturday, February 5, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గని నుంచి రోమియో జూలియట్‌‌ సాంగ్.. ఫిబ్రవరి 8న ముహూర్తం, పాడింది ఎవరో తెలుసా..?

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘‘గని’’. బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అల్లు అరవింద్ సమర్పకుడిగా.. అల్లు బాబీ కంపెనీ, రినైస్సన్స్ పిక్చర్స్ పతాకాల‌పై ‘‘గని’’ని సిద్ధు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన గని.. కోవిడ్, లాక్‌డౌన్ తదితర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు కుదటపడటంతో గని మేకర్స్ కూడా రిలీజ్‌పై అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు. ఫిబ్రవరి 25 కానీ, మార్చి 4న కానీ ఈ సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు వెల్లడించారు.

గని నుంచి రోమియో జూలియట్‌‌ సాంగ్.. ఫిబ్రవరి 8న ముహూర్తం, పాడింది ఎవరో తెలుసా..?

అప్పుడెప్పుడో టీజర్లు, ట్రైలర్లు తప్పించి మళ్లీ ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని భావించిన నిర్మాతలు.. గని నుండి థర్డ్ లిరికల్ వీడియో సాంగ్ ‘‘ రోమియో జూలియట్’’ను ఫిబ్రవరి 8న విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పాటను పాన్ ఇండియా డైరెక్టర్ కుమార్తె ఆలపించారట... థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆ పాట పాడిన ఆ డైరెక్టర్ కూతురు ఎవరో తెలియాలంటే సోమవారం వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక గనిలో బాక్సర్‌గా కనిపించేందుకు వరుణ్ తేజ్ ఎంతో కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ పెంచడంతో పాటు అమెరికాకు వెళ్లి మ‌రీ ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను తీసుకున్నారు. హాలీవుడ్ చిత్రం టైటాన్స్‌, బాలీవుడ్‌లో సుల్తాన్ వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను రూపొందించిన హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ ఈ చిత్రానికి పనిచేస్తుండటం విశేషం. అలాగే మిల్కీబ్యూటీ త‌మ‌న్నా గనిలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.