close
Choose your channels

సక్సెస్ జోష్‌లో భీమ్లా నాయక్.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన పవర్‌స్టార్, ఫోటోలు వైరల్

Sunday, February 27, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సక్సెస్ జోష్‌లో భీమ్లా నాయక్.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన పవర్‌స్టార్, ఫోటోలు వైరల్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘‘భీమ్లా నాయక్’’. ఎన్నో అడ్డంకులు, అవాంతరాలను దాటుకుని ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌తో విజయవంతంగా దూసుకెళ్తోంది. రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్‌పై వేట షురూ చేశారు పవన్ . ఈ సినిమా విజయం సాధించడంతో చిత్ర యూనిట్ మంచి జోష్‌లో వుంది. ఇప్పటికే శనివారం సక్సెస్ మీట్ నిర్వహించిన భీమ్లా నాయక్ బృందం.. సాయంత్రం పార్టీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ విందుకు స్వయంగా పవన్ కూడా హాజరై అందరిలో ఉత్సాహం నింపారు. భీమ్లా నాయక్ కోసం పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్, సింగర్లు కూడా పార్టీకి హాజరయ్యారు.

ఇకపోతే.. నిన్నటి సక్సెస్‌మీట్‌లో భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి తనపై జరుగుతున్న ప్రచారంపై దర్శకుడు త్రివిక్రమ్ స్పందించారు. సినిమాకు సంబంధించి సాగర్ కు అన్నీ సమకూర్చడం వరకు మాత్రమే తన పాత్రను పరిమితం చేసుకున్నానని చెప్పుకొచ్చాడు. అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు ఎందుకు మాట్లాడలేదన్న ప్రశ్నకు త్రివిక్రమ్ స్పందిస్తూ.. దర్శకుడు సాగర్ చంద్ర ఆ ఫంక్షన్ లో ఎలివేట్ అవ్వాలని, అందుకే తను మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయానని ఫ్యాన్స్ తో చెప్పుకొచ్చాడట త్రివిక్రమ్.

ఇకపోతే.. ఈ సినిమాలో పవర్‌స్టార్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్‌, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ‘‘భీమ్లా నాయక్’’ను నిర్మిస్తుండగా.. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment