close
Choose your channels

తెలుగుదేశం పార్టీకి భుజం కాసినప్పుడు నా కులం గుర్తుకురాలేదా - పవన్

Saturday, August 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ...నేను తెలుగుదేశం ప‌క్ష‌పాతిని తొత్తుని కాదు. ప్ర‌జ‌ల ప‌క్ష‌పాతిని రైతు ప‌క్ష‌పాతిని... ఆడ‌బిడ్డ‌ల ప‌క్ష‌పాతిని.. అంతే కానీ నేను ఏ ఒక్క పార్టీకో వ్య‌క్తుల‌కో నా జీవితాన్ని ఇవ్వ‌ను అన్నారు. అభిమాని వినోద్ మ‌ర‌ణం గురించి మాట్లాడుతూ.... సినిమా అనేది వినోదంగానే చూడండి. వేరే హీరోల‌తో నేను బాగానే ఉంటాను. వినోదాన్ని చూసి మ‌ర‌చిపోండి.
నేను నిజ జీవితాన్ని సీరియ‌స్ గా తీసుకుంటాను. నాతో స‌హ ఏ హీరో న‌టించినా అది సినిమా కోసం. క్ష‌ణిక‌మైన కోపంతో జీవితాన్ని నాశ‌నం చేసుకోవ‌ద్దు. జ‌న‌సేన సైనికుడు వినోద్ హ‌త్య‌కు గురైయ్యాడు అని తెలిసిన‌ప్పుడు చాలా బాధేసింది. ఏడుపు వ‌చ్చేసింది. రాత్రి ఇంటికి వ‌స్తాను అన్న బిడ్డ హ‌త్య‌కు గురైయ్యార‌ని తెలిసి ఆ త‌ల్లి ప‌డ్డ వేద‌న అంతా ఇంతా కాదు. కొడుకు చ‌నిపోయాడు అనే బాధ‌లో ఉన్నా కూడా క‌ళ్లు దానం చేసిన‌ గొప్పమ‌నిషికి పాదాభివంద‌నాలు. అలాంటి త‌ల్లుల బిడ్డ‌ల భ‌విష్య‌త్ కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. అమ‌రావ‌తిలో రైతులు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటే వెళ్లాను. తెలుగుదేశం పార్టీ వాళ్లు సానుకూలంగానే స‌హ‌క‌రించారు. స‌మ‌స్య ఎక్క‌డ వ‌చ్చింది అంటే....నేను భుజం కాసాను. నా వ‌ల్ల అధికారంలోకి వ‌చ్చిందా అని ఆలోచించ‌ను. మ‌న సాయం మ‌నం చేసాం అంతే ఆలోచిస్తాను. నేను రిస్క్ ఎదుర్కొని రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. మోడీని క‌లిసిన‌ప్పుడు తెలుగుదేశంకు స‌పోర్ట్ అందించిన‌ప్పుడు ప‌వ‌న్ అభిమానులు స‌మాజానికి ఉప‌యోడ‌ప‌డే వాళ్లు అని రాసారు. కానీ...ఆశ్చ‌ర్యం ఏమిటంటే... స‌డ‌న్ గా తెలుగుదేశం ప్ర‌భుత్వ విధివిధానాల‌ను అడిగాను. అంతే....ప‌వ‌న్ చుట్టూ అత‌ని కులం వాళ్లే ఉంటారు అని రాసారు.
నా కూతురు క్రిష్టియ‌న్. నా కూతురుకి త‌ల్లి త‌న మ‌తాచార్ని ఇస్తాను అంటే స‌రే అన్నాను. నేను హిందువులో పుట్టాను. నా దృష్టిలో స‌ర్వ‌మ‌తాలు ఒక్క‌టే. స‌ర్వ‌కులాలు ఒక్క‌టే. అలాంటిది నాకు కులం, ప్రాంతం అంట‌గ‌డితే కోపం వస్తుంది. అలా రాసిన స‌న్నిహితుల‌కు చెప్పాను. తెలుగుదేశం భుజం కాసిన‌ప్పుడు నా కులం గుర్తుకురాలేదా అన్నాను. అర్ధం చేసుకుని రిపీట్ చేయ‌లేదు.మ‌న‌ది ఒక‌టే కులం మాన‌వ‌తా కులం అంటూ త‌న ఆవేద‌న‌ వ్య‌క్తం చేసారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.