స్మార్ట్ లుక్‌తో పవన్.. వైరల్ అవుతున్న ఫోటో..


Send us your feedback to audioarticles@vaarta.com


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో గుబురు గడ్డం.. ఒత్తైన జుట్టుతో కనిపించిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలలపాటు పవన్ చాతుర్మాస దీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ దీక్ష ఇటీవలే ముగిసింది. దీంతో పాటు ప్రస్తుతం పవన్ ‘వకీల్ సాబ్’ షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ లుక్ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. గుబురు గడ్డం, ఒత్తైన జుట్టు తీసేసి సరికొత్త లుక్‌లో పవన్ కనిపిస్తున్నారు.
పవర్ స్టార్ తాజా ఫోటో ఒకటి బయటకు వచ్చింది. తన స్నేహితుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో దిగిన ఫొటో అది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవన్ స్మార్ట్ లుక్ కిర్రాక్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ‘వకీల్ సాబ్’ షూటింగ్ జరుగుతోంది. అందులో పవన్ కూడా పాల్గొంటున్నారు. అందుకే పవన్ ఈ స్మార్ట్ లుక్‌లోకి మారిపోయారని టాక్. ‘వకీల్ సాబ్’లో పవన్ లుక్ ఇదేనని అభిమానులు భావిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments