close
Choose your channels

Mudragada:పవన్ కల్యాణ్‌ ముగ్గురు భార్యలను కూడా పరిచయం చేయాలి: ముద్రగడ

Monday, May 6, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తన కుమార్తెను రోడ్డు మీద బహిరంగంగా పరిచయం చేసిన పవన్ కల్యాణ్.. తన ముగ్గురు భార్యలను కూడా పరిచయం చేయలగలరా అని మండిపడ్డారు. ఇకపై కుమార్తెతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తన కుటుంబ సభ్యులకు ఏమి జరిగినా ఇంటికి తన కూతుర్ని పంపించకండని సూచించారు. ముద్రగడ కూతురుగా కాకుండా వారి అత్తింటి పేరు వాడుకోమని సలహా ఇచ్చారు. ఎలాగో తన అమ్మాయిని రోడ్డుపైకి లాగేసారు కాబట్టి.. టీవీ డిబేట్లలో, పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో రోడ్ల మీద తిప్పండని.. అయినా కానీ తానేమీ భయపడనని స్పష్టంచేశారు.

తనను రోడ్డుపైకి లాగింది పవన్ కల్యాణే అని.. ఇప్పుడు తన ఫ్యామిలీని కూడా రోడ్డుకు ఇడ్చేశారని విమర్శించారు. లక్ష పుస్తకాలు చదివింది ఇందుకేనా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ తమ కుటుంబంలో చిచ్చుపెట్టారని ఫైర్ అయ్యారు. పిఠాపురంలో తన సీటుకే దిక్కులేదు.. తన కూతురుకు పదవి ఇస్తారంట అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‎ను భీమవరం, గాజువాక నుంచి ప్రజలు తరిమేశారని.. పిఠాపురంలో కూడా తరిమేయబోతున్నారని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదని సూచించారు.

పవన్ కళ్యాణ్‎కి ట్రైనింగ్ ఇచ్చేది ఆయన గురువు చంద్రబాబు అని ఆరోపించారు. ఎన్నికల తరువాత జనసేన పార్టీ ఉండదు అని ప్యాకప్ అయిపోతుంది అని విమర్శించారు. చంద్రబాబు వద్ద మార్కెటింగ్ మేనేజర్‌గా పవన్ పనిచేస్తున్నారని విమర్శలు చేశారు. చిరంజీవి కుటుంబంలో వివాదాలు లేవా.. మీ కుటుంబంలోని ఓ అమ్మాయి పబ్‌లో తాగి దొరకలేదా..? మీ కుటుంబలో అమ్మాయి ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకోలేదా..? అయినా కానీ ఏ రోజు మీ కుటుంబం గురించి తాను మాట్లాడలేదని.. ఈరోజు తన కుటుంబాన్ని మీ తమ్ముడు పవన్ కల్యాణ్‌ రోడ్డుకీడ్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించి తీరుతానని ముద్రగడ సవాల్ విసిరారు.

కాగా ముద్రగడ కుమార్తె క్రాంతి, అల్లుడు ఆదివారం వారాహి విజయభేరి సభలో పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె జనసేన పార్టీలో చేరతానని ప్రకటించగా.. మీ తండ్రి ముద్రగడ అనుమతితోనే పార్టీలో చేర్చుకుంటానని పవన్ తేల్చిచెప్పారు. దీంతో ముద్రగడ పైవిధంగా స్పందించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.