మెగాస్టార్ మల్టీస్టారర్.. మరో హీరో ఎవరంటే?
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ వరుస సినిమాలతో స్పీడు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది పూర్తవగానే చిరంజీవి మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్‌లో నటిస్తున్నారు. ఇది కాకుండా బాబీ, మెహర్ రమేశ్, హరీశ్ శంకర్, సుకుమార్ వంటి దర్శకులతో పనిచేయబోతున్నానని ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తెలియజేసిన సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా బాబీ ఆల్రెడీ చిరంజీవిని కలిసి కథ చెప్పారని కూడా ఆయన చెప్పారు.
తాజాగా సినీ వర్గాల్లో వినపడుతున్న సమాచారం మేరకు బాబీ ఆమధ్య చిరంజీవిని కలిసినప్పుడు ఓ మల్టీస్టారర్ కథ చెప్పాడట. కథ చిరంజీవికి నచ్చడంతో ఆయన ఓకే అన్నాడట. ఆసక్తికరమైన విషయమేమంటే.. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో నటించబోయే మరో స్టార్ ఎవరో తెలుసా? రానా దగ్గుబాటి అని వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటి వరకు రీ ఎంట్రీలో చరణ్‌తో మాత్రమే కలిసి నటించిన చిరంజీవి ఈసారి మరో హీరోతో కలిసి నటించబోతున్నాడన్నమాట. వెంకీమామ వంటి సక్సెస్ తర్వాత డైరెక్టర్ బాబీ డైరెక్ట్ చేయబోయే చిత్రమిదే కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
![ఓటు అనేది హక్కు మాత్రమే కాదు ! Mega Star Chiranjeevi Family Cast Their Vote Telangana Elections 2023](https://i.ytimg.com/vi/0nL-M222GuU/hqdefault.jpg)
![ఓటు వేసేందుకు వచ్చిన చిరంజీవి Mega Star Chiranjeevi Family Cast Their Vote |Telangana Elections 2023](https://i.ytimg.com/vi/bL0a7p5d_a4/hqdefault.jpg)
Comments