close
Choose your channels

దెయ్యాలను భయపెట్టే సినిమా రావడం ఇదే ఫస్ట్ టైమ్ - ప్రభాస్

Tuesday, August 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హార‌ర్ కామెడీ చిత్రాల‌కు టాలీవుడ్‌లో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. సినిమాలు కూడా మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తున్నాయి. ఆగ‌స్ట్ 18న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న హార‌ర్ కామెడీ చిత్రం `ఆనందో బ్ర‌హ్మ‌`. తాప్సీ, శ్రీనివాస‌రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, తాగుబోతు ర‌మేష్‌, ష‌క‌ల‌క‌శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా, పాఠ‌శాల సినిమా ద‌ర్శ‌క నిర్మాత మ‌హి వి.రాఘ‌వ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. భ‌లేమంచి రోజు వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

సాధార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు దెయ్యాలే మ‌నుషుల్ని భ‌య‌పెడుతుండే సినిమాల‌నే చూశాం. కానీ భిన్నంగా ద‌ర్శ‌కు మ‌హి దెయ్యాన్ని భ‌య‌పెట్టే మ‌నుషుల క‌థ‌తో సినిమాను తెర‌కెక్కించారు. సినిమా ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రీ రిలీజ్ వేడుక ఆగ‌స్ట్ 14న జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి యూనిట్ స‌భ్యుల‌ను అభినందించారు. ప్ర‌భాస్ మాట్లాడుతూ..ఫస్ట్‌టైమ్‌ ఇండియన్‌ సినిమాలో ఓ దెయ్యం మనుషులకు భయపడం అనే కాన్సెప్ట్‌తో సినిమా రావడం. చాలా కొత్తగా ఉంది. ఆసక్తికరంగా ఉంది. తాప్సీ మోస్ట్‌ బ్యూటీఫుల్‌ దెయ్యంగా నటించనుంది. మహిగారి కాన్సెప్ట్‌ బావుంది. విజయ్‌ ఎప్పుడు కలిసినా సినిమా గురించే మాట్లాడుతాడు. విజయ్‌, శశిలకు అభినందనలు. బెస్ట్‌ యాక్టర్స్‌ అందరూ ఇందులో నటించారు. ఆగస్టు 18న సినిమా విడుదలవుతుంది. సినిమా గురించి మంచి టాక్‌ వింటున్నానని తెలిపారు.

నేను ,విజయ్‌ కాలేజ్‌ ఫ్రెండ్స్‌. విజయ్‌కు సినిమాల గురించి అప్పట్లోనే మంచి నాలెడ్జ్‌ ఉండేది. ముందు నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత భలేమంచిరోజు సినిమాతో విజయ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ప్రేమకథాచిత్రమ్‌ తర్వాత హారర్‌ కామెడి జోనర్‌ సినిమాలతో చాలా మంది సినిమాలు చేస్తామని వచ్చారు. ప్రేమకథాచిత్రమ్‌ పార్ట్‌2 తీద్దామని డిస్కషన్స్‌ కూడా జరిగాయి. అయితే ప్రేమకథాచిత్రమ్‌ రేంజ్‌ కామెడి ఉంటే తప్ప ఆ జోనర్‌ మూవీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. విజయ్‌, శశి హారర్‌ కామెడీ సినిమా చేస్తున్నారనగానే కాస్తా భయమేసింది. కానీ వారికి ఎలాంటి కథలను సెలక్ట్‌ చేసుకోవాలో బాగా తెలుసు.

సినిమా అంతా పూర్తయిన తర్వాత విజయ్‌ నన్ను సినిమా చూడమని చెప్పాడు. చూసిన తర్వాత ప్రేమకథాచిత్రమ్‌ కంటే సినిమా బావుంది. ప్రేమకథాచిత్రమ్‌ను ప్రేమిస్తే, ఈ సినిమాను ప్రేక్షకులు పెళ్లి చేసుకునేంత బాగా ఉంది. నాకు ఈ సినిమా కథ ముందుగానే చెప్పి ఉంటే ప్రేమకథాచిత్రమ్‌ 2గా సినిమా చేసుండేవాడిని. మహి సెన్సిబుల్‌ డైరెక్టర్‌. సినిమాను రేపు థియేటర్స్‌లో చూసి ఎంజాయ్‌ చేస్తారని హీరో సుధీర్‌బాబు చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.