close
Choose your channels

Prashant Kishore:ప్రశాంత్ కిషోర్ కల్లబొల్లి మాటలు.. యెల్లో మీడియా రాతలు..

Monday, March 4, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఐప్యాక్ సంస్థ వ్యవస్థాపకుడిగా ప్రశాంత్ కిషోర్ గతంలో కొన్ని పార్టీల తరపున పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి బీహార్‌ రాజకీయాల్లో అడుగుపెట్టాలరు. సొంతంగా పార్టీ పెట్టుకుని అక్కడ పాగా వేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే ఆయనకు ప్రజల్లో ఆదరణ రాకపోవడంతో ఢీలా పడ్డారు. దీంతో తన ఉనికి కాపాడుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి పనిచేసే దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే మాజీ టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ సమకూర్చిన ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చి చంద్రబాబును కలిశారు.

చంద్రబాబుతో రహస్య భేటీలు..

ఇటీవల హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో నాలుగు గంటల పాటు భేటీ అయ్యారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోబోతున్నారంటూ వ్యాఖ్యానించారు. అంతే ఇక యెల్లో మీడియా రెచ్చిపోయింది. వైసీపీ పని అయిపోయింది.. జగన్ ఓడిపోవడం ఖాయం అని వార్తలను ప్రచారం చేసి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నాలు మెదలుపెట్టింది. ప్లాప్ సినిమాకు ప్రచారం ఎక్కువ.... ఓడిపోయే పార్టీకి డైలాగులు ఎక్కువ... ఈ నానుడిని ఏపీలో ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు.

సీఎం జగన్‌ను ఎదుర్కోలేక..

సీఎం జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేమని అర్థమైన టీడీపీ- జనసేన కూటమి ఇప్పుడు తప్పుడు ప్రచారాలకు తెరదీసింది. లేని హైప్‌ను ఉన్నట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలకు సిద్ధమైంది. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలతో పాటు అశేషమైన కార్యకర్తల బలంతో దూసుకుపోతున్న జగన్‌ను ఎదుర్కోవడం అసాధ్యమని భావిస్తున్నాయి. దీంతో తమ భవిష్యత్ కళ్ళ ముందు కదలాడుతుండగా చంద్రబాబు తన అసలు కుట్రలను బయటకు తీశారు. అందులో భాగంగా ఏనాడో రాజకీయ వ్యూహకర్త అనే వృత్తిని వదిలేసి పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్‌తో ఒక తప్పుడు కామెంట్ చేయించారు.

తెలంగాణలో తప్పిన పీకే అంచనాలు..

ఆ వ్యాఖ్యలను తన మీడియా ద్వారా ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. ఒక జట్టుతో కలిసి పనిచేసినప్పుడు లభించే ఫీడ్‌బ్యాక్‌ ప్రశాంత్‌ కిశోర్‌కు ఇప్పుడు లభించే అవకాశం లేదు. దీంతో ఆయన చేసింది గాలివాటం ప్రకటన లాగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాగే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని.. కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి అవుతారని పీకే తెలిపారు. చివరకు బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అలాగే ఏపీలోనూ ప్రశాంత్ అంచనాలు తప్పడం ఖాయమని చెబుతున్నారు. జగన్ ప్రభంజనం ముందు వీళ్లంతా దిగదుడుపే అని ప్రజలు అనుకుంటున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది జగనే అని.. ఎవరెన్ని కుట్రలకు పాల్పడినా వైసీపీ గెలుపును ఆపలేరని స్పష్టంచేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.