close
Choose your channels

పోస్ట్‌ ప్రొడక్షన్‌లో 'ప్రేమంటే సులువు కాదురా'

Monday, August 24, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సుప్రసిద్ధ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా రూపొందుతున్న వినూత్న ప్రేమకథా చిత్రం ప్రేమంటే సులువు కాదురా`. రాజీవ్‌ సరసన సిమ్మిదాస్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని చందా గోవింద్‌రెడ్డి దర్శకత్వంలో.. ఆర్‌.పి.ప్రొడక్షన్స్‌ పతాకంపై భవనాసి రాంప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కొమారి సుధాకర్‌రెడ్డ~ శ్రీపతి శ్రీరాములు సహ నిర్మాతలు. ఆటో నడుపుకొనే అబ్బాయికి~ ఇంజనీరింగ్‌ చదువుకునే అమ్మాయికి` మధ్య ఏర్పడిన ప్రేమ ఎటువంటి పరిణామాలకు దారి తీసిందనే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయ్యింది. శరవేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా నిర్మాత భవనాసి రాంప్రసాద్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు తెలుగులో వచ్చిన అత్యుత్తమ ప్రేమకథా చిత్రాల జాబితాలో ప్రేమంటే సులువు కాదురా` కూడా స్థానం సంపాదించుకుంటుందనే నమ్మకం మాకుంది. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న చందా గోవింద్‌రెడ్డికి ఉజ్వలమైన భవిష్యత్‌ ఉంటుంది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుంచి లాస్ట్‌ ఫ్రేమ్‌ వరకు సినిమాను ఎంతో బ్యూటిఫుల్‌గా.. చాలా ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దుతున్నాడు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ దాదాపుగా పూర్తి కావచ్చింది. త్వరలోనే ఆడియో విడుద చేయనున్నాం` అన్నారు.

కాశీ విశ్వనాధ్‌, మధుమణి, చంటి, చమ్మక్‌చంద్ర, వైజాగ్‌ అప్పారావు, చిట్టిబాబు, ఖలీల్‌ భాషా ఇతర ముఖ్యపాత్రు పోషిస్తున్న ఈ చిత్రానికి సంభాషణలు: గోవిందరెడ్డి ~సుమన్‌, పాటలు : కృష్ణ మదినేని, సంగీతం: నందన్‌రాజ్‌, ఛాయాగ్రహణం: సురేష్‌ రఘుట, ఎడిటింగ్‌: యస్‌.బి.ఉద్ధవ్‌, సహనిర్మాతలు: కొమారి సుధాకర్‌రెడ్డి` శ్రీపతి శ్రీరాములు, నిర్మాత: భవనాసి రాంప్రసాద్‌, కథ~ మాటలులు ~ స్క్రీన్‌ప్లే~ దర్శకత్వం: చందా గోవింద్‌రెడ్డి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.